ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరింపు: పోలీసులకు టెక్కీ ఫిర్యాదు
విశాఖపట్నం: తన భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించాడు. ఎళ్లవేలలా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, తనకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తోందంటూ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో అతను ఆరోపించాడు.
విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన స్రవంతి అనే యువతికి చిన్నకృష్ణ అనే యువకుడితో 2014లో వివాహమైంది. ఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం వీరిద్దరు బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారి మధ్య ఆర్థిక విషయాల కారణంగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది.

ఆ తర్వాత మరోమారు తనను బెదిరించిందని, దీంతో తాను భయపడి ఈ ఫిర్యాదు చేస్తున్నానని అతను చెప్పాడు. పైగా తమ సమస్య పరిష్కారం కోసం ఉండ్రాజవరం గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడినా ఫలితం లేదని చెప్పారు. దీనిపై ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications