ఫేస్‌బుక్ యాజమాన్యం నుండి రక్షణ కల్పించండి: టెక్కీ
హైదరాబాద్: ఫేస్‌బుక్ యాజమాన్యం నుండి తనకు ప్రాణహానీ ఉందని, భద్రత కల్పించే విధంగా పోలీసులను ఆదేశించాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాదుకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఫేస్‌బుక్‌లో ఉన్న లోపాలు, మోసాలను ఎత్తి చూపించినందుకే తన పై ఆ సంస్థ కక్ష కట్టిందన్నారు.
కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం
విశాఖలోని కేజీహెచ్‌లో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఆవరణలోని చెట్ల వ్యర్థాలకు నిప్పంటుకోవడంతో ఒక్కసారి గా మంటలు చెలరేగాయి. రోగులతోపాటు వారి బంధువులు, ఆస్పత్రి వైద్యులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపుచేయడంతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్‌ఎంఓ పరిస్థితిని సమీక్షించారు.

ఏవోబీలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
ఆంధ్రా, ఒడిసా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులకు చెందిన డంప్‌ను బీఎస్‌ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ డంప్‌లో టిఫి న్ బాక్సులు, విద్యుత్ వైర్లు, వున్నాయి. మల్కన్‌గిరి జిల్లా కోడాపుట్టు సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ డంప్ దొరికింది.
ఉపాధి నిధుల కేసులో మాజీ సర్పంచ్‌కు జైలు శిక్ష
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కట్కూర్ మాజీ సర్పంచ్‌కు ఉపాధి నిధులు స్వాహా చేసిన కేసులో ఆరు నెలల జైలు శిక్ష, 80 వేల రూపాయల జరిమానా విధిస్తూ ప్రత్యేక సంచార కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్‌రావు తీర్పును వెలువరించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో సంచార కోర్టును నిర్వహించారు.
కట్కూర్‌లో ఉపాధిహామీ సొమ్ములో లక్షా 65 వేల 300 రూపాయల తన సొంతానికి వాడుకున్నట్లుగా సామాజిక తనిఖీలో వెల్లడయ్యింది. పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో 7 నెలలు జైలు శిక్ష అమలు చేయాలని స్వాహా చేసిన నిధులను కూడా రికవరీ చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications