తండ్రికి బైక్ కొని రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతి

గంగారం గ్రామానికి చెందిన నాగుల వీరవెంకటయ్య కుమారుడు ఆంజనేయులు (25) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.మరో నెల రోజుల్లో ఆంజనేయులు అమెరికా వెళ్లాల్సి ఉంది. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చాడు.
తన తండ్రికి సంక్రాంతి కానుకగా తన సంపాదనతో మోటార్ సైకిల్ కొనివ్వాలని అనుకున్నాడు. మోటార్ సైకిల్ కొనడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు మంగళవారంనాడు వెళ్లాడు. మోటార్ సైకిల్ కొని దానిపైనే తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం మాల్లాయిగూడెం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా వచ్చాడు.
అతన్ని తప్పించే ప్రయత్నం చేయడంతో ఆంజనేయులు బైక్ అదుపు తప్పి కిందపడింది. దాంతో అతని తలకు బలమైన గాయమైంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.












Click it and Unblock the Notifications