భార్యాఅత్తలను చంపిన టెక్కీ, ప్రేయసి గొంతు కోశాడు

కాపురం ప్రశాంతంగా జరిగిన సంఘటనలు లేవు. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. నిజానికి, పద్మప్రియకు అంతకు ముందు ఓ పెళ్లి అయింది. ఈ విషయం పెళ్లి సమయంలో శర్వానంద్‌కు చెప్పలేదు. ఆ విషయం తెలిసి అతను వేరుగా ఉంటున్నాడు. పద్మప్రియ, తల్లి పరమేశ్వరి శర్వానంద్‌తో గొడవ పడడం మాత్రం మానలేదు. వారు విసిగిస్తుండడంతో అతను భార్యను, అత్తను చంపి పోలీసులకు లొంగిపోయాడు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కాసారం గ్రామంలో ప్రేమించిన యువతిని ప్రియుడు గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఆమెకు మరొకరితో నిశ్చితార్థం జరగడంతో ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. దాంతో గురువారం ఉదయం ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
అమ్మాయి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications