బందరు టెక్కీ మృతి: రసాయనాల మాస్క్ (పిక్చర్స్)

ముంబై/హైదరాబాద్: మహారాష్ట్ర ముంబైలోని టిసిఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నానికి చెందిన ఈస్తర్ అనూహ్య(23) అనుమానస్పద మృతిపై ఇంకా చిక్కుముడి వీడలేదు. కాగా అనూహ్య మృతిపై విచారణ జరుపుతున్న ముంబై పోలీసులు మాట్లాడుతూ.. ఆమె హత్య కోసం నిందితులు ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని ఉపయోగించి కాల్చివేసే ప్రయత్నం చేసినట్లు ఉందని తెలిపారు. ఆమె మృతదేహం ఒక రకమైన దుర్వాసనను కలిగి ఉందని చెప్పారు. అందువల్ల కేసులో రసాయన శాస్త్ర నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

పోస్టుమార్టం తర్వాత వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. అనూహ్యపై అత్యాచారం జరిగిందని వారు నిర్దారణకు వచ్చారు. అయితే అత్యాచారమే ఆమె మరణానికి కారణం కాకపోవచ్చని వారు తెలిపారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత, నిందితులు ఆమెను హత్య చేసి కంజుర్‌మార్గ్ ప్రాంతంలో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై ప్రత్యేక రసాయనాలు వాడి దహనం చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆమె మృతదేహానికి గాయాలున్నాయని వారు చెప్పారు. ఆమె హత్యలో ఇద్దరు వ్యక్తులు పాల్గొని ఉంటారని తెలిపారు. అయితే ఆమె హత్యకు ప్రధాన కారణం తెలియాల్సి ఉందని విచారణాధికారి చెప్పారు.

కాగా జనవరి 5వ తేదీన అదృశ్యం అయిన అనూహ్య ముంబైలో శవమై గురువారం రాత్రి కనిపించింది. కాకినాడ జెఎన్‌టియులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఏడు నెలలుగా ముంబైలోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టిసిఎస్)లో ఉద్యోగం చేస్తోంది. ముంబబైలోని అంధేరిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగానికి వెళుతోంది. క్రిస్మస్ సెలవులకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య జనవరి 4న విజయవాడలో బాలగంగాధర్ తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ముంబైకి బయల్దేరింది. మధ్యలో ఓసారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది.

స్వస్థలానికి అనూహ్య మృతదేహం

స్వస్థలానికి అనూహ్య మృతదేహం

ముంబైలో అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత శనివారం ఉదయం స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి తీసుకొచ్చారు. అనూహ్య మృతదేహం చూసిన ఆమె తల్లి జ్యోత్స్య సొమ్మ సిల్లిపడిపోయింది.

అనూహ్య మృతదేహం

అనూహ్య మృతదేహం

ముంబైలో అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత శనివారం ఉదయం స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి తీసుకొచ్చారు. అంబులెన్స్‌లో అనూహ్య మృతదేహాన్ని తీసుకొస్తున్న దృశ్యం.

అనూహ్య

అనూహ్య

మహారాష్ట్ర ముంబైలోని టిసిఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నానికి చెందిన ఈస్తర్ అనూహ్య(23) అనుమానస్పద మృతిపై ఇంకా చిక్కుముడి వీడలేదు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత శనివారం స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి తీసుకొచ్చారు.

అనూహ్యకు నివాళి

అనూహ్యకు నివాళి

ముంబైలో అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత శనివారం ఉదయం స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు అనూహ్యకు నివాళి
అర్పించారు.

ఆ తర్వాత ఆమె నుండి ఫోన్ రాకపోవడంతో ఆందోళన చెందిన బందరులోని ఆమె తల్లితండ్రులు అక్కడి బంధుమిత్రులు, ఆమె పనిచేస్తున్న టిసిఎస్ కంపెనీలోను, ఆమె ఉంటున్న హాస్టల్‌లోను ఆరా తీశారు. అనూహ్య అక్కడకు రాలేదని వారు చెప్పడంతో ఆందోళనకు గురైన వారు విజయవాడలోని రైల్వే పోలీసులకు, ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ముంబైలోని కంజుర్‌మార్గ్‌లో గురువారం రాత్రి ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

స్వస్థలానికి చేరుకున్న అనూహ్య మృతదేహం

ముంబైలో అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత శనివారం ఉదయం స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి తీసుకొచ్చారు. అనూహ్య మృతదేహం చూసిన ఆమె తల్లి జ్యోత్స్య సొమ్మ సిల్లిపడిపోయింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని అనూహ్యకు నివాళి అర్పించారు. మరికాసేపట్లో అనూహ్య అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మరోవైపు అనూహ్య హత్యను నిరసిస్తూ మచిలీపట్నంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+