టైర్ పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు: టెక్కీ సహా భార్య, తల్లి మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్‌లోని నల్లకుంట డీడీ కాలనీలోకి చెందిన చైతన్యచంద్ర(38) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోదరుడి ఆహ్వానం మేరకు బెంగళూరు తిరుమలై ఆలయ దర్శనానికి చైతన్యచంద్ర తన కారులో భార్య దీప్తి(30), తల్లి సీత(64), పిల్లలు పీయుష్(5), ఆయుష్(1)లతో కలిసి బెంగుళూరుకు బయలుదేరాడు.

మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయరహదారిపై కారు ముందరి టైరు పగిలి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో చైతన్యచంద్రతో పాటు దీప్తి, సీత కారులోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. పీయుష్, ఆయుష్‌లను పోలీసులు కారులో నుంచి బయటకు తీసి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పీయుష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళ్లారు.ఆయుష్‌కు స్వల్ప గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. దీప్తి సీఏ చదివి ఉద్యోగం చేసేది. సీత ఎల్‌ఐసీలో అసిస్టెంట్ సెక్రటరీగా చేశారు.












Click it and Unblock the Notifications