ట్విస్ట్: బాబుకు నోటీసులిచ్చే అధికారంలేదు, కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ఏసీబీకి అదికారం లేదని, అందుకే తాము వాటిని తీసుకునేది లేదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం చెప్పారు.
అదే అయితే, తమ ఏసీబీకి ఉంటుందన్నారు. తెలంగాణ చర్యకు తమ వద్ద ప్రతిచర్య ఉందని చెప్పారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. కేసీఆర్ పైన 87 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కేసీఆర్ పైన నమోదైన కేసులు అన్నింటికి తాము నోటీసులు ఇస్తామని చెప్పారు.

కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి: జూపూడి
ఒక ప్రజాస్వామ్య పార్టీగా తెలుగుదేశం పార్టీ విభజనను గౌరవించిందని జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఏసీబీని చేతుల్లోకి తీసుకొని రేవంత్ రెడ్డి పైన దాడి చేయడం దౌర్భాగ్యం అన్నారు. సెక్షన్ 8 చెల్లదని చెప్పేందుకు కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు.
సెక్షన్ 8 చెల్లదని చెప్పిన కేసీఆర్‌ను గవర్నర్ అరెస్టు చేయించాలన్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతూ, దేశ, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏసీబీకి నోటీసులు ఇచ్చే అధికారమే లేదన్నారు.
ఇంతవరకు స్టీఫెన్ సన్ వాంగ్మూలం తీసుకోలేదని, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలు రాలేదని, ఈ నేపథ్యంలో చంద్రబాబుకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఏసీబీ ఇదే ధోరణితో ముందుకు వెళ్తే దానిని కోర్టుకు లాగుతామని చెప్పారు.
గవర్నర్ నరసింహన్ పైన కూడా ఆయన భగ్గుమన్నారు. సెక్షన్ 8 ఏమిటనేది విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.
నిన్న గవర్నర్‌తో భేటీ అయినప్పుడు సెక్షన్ గిక్షన్ జాన్తా నయి అని కేసీఆర్ అంటే నరసింహన్ ఎంతవరకు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏమైనా సుప్రీం కోర్టా లేక హైకోర్టా అని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి వాళ్లను చాలామందిని చూశామన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications