టీ బడ్జెట్: వరంగల్ దాకా పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్‌కు ఇవి..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండలిలో బడ్జెట్ ప్రవేశ పెడతారు.
తెలంగాణ బడ్జెట్: 1,15,689 కోట్లు
ప్రణాళిక వ్యయం: 52,383 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: 63,306 కోట్లు
రెవెన్యూ మిగులు: 531 కోట్లు
కేంద్ర పన్నుల వాటా రూ.12,823 కోట్లు

బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
హైదరాబాద్ - వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్
ముచ్చెర్లలో 11వేల ఎకరాల్లో ఫార్మా సిటీ
హాస్టళ్లకు రూ.2200 కోట్లు
గిడ్డంగులు రూ.403 కోట్లు
మార్కెటింగ్ శాఖకు రూ.411 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ.4వేల కోట్లు
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ. 22,889 కోట్లు
2018కల్లా తెలంగాణలో మిగులు బడ్జెట్
విద్యుత్‌రంగం పునరుద్దరణకు తొలిఅడుగులు
పట్టణాభివృద్ధికి రూ. 1000కోట్లు
పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
తడకపల్లి, పాములపర్తిలో రిజర్వాయర్లు
108 వాహనాల సంఖ్యను 335 నుంచి 603కు పెంచుతాం
104 సేవలను మెరుగపరుస్తాం
పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తాం
హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం
సంక్షేమం, వ్యవసాయం, ఉపాధికి ప్రాధాన్యత
డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.200 కోట్లు
చిన్న నీటి పారుదలకు రూ.200 కోట్లు
వరంగల్, కరీంనగర్, నిజామాబాదులలో ఈ మార్కెటింగ్ వేలం నిర్వహిస్తున్నాం
రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధి అవసరం
పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షిస్తాం
ఎస్సీ, ఎస్టీల భూముల కొనుగోలుకు రూ.1000 కోట్లు
ఆర్టీసి కొత్త బస్సుల కోసం రూ.400 కోట్లు
ఆహార భద్రత, సబ్సిడీకి రూ.2200 కోట్లు
కిలో వాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు
రెవెన్యూ ఆదాయం రూ.94131 కోట్లు
పర్యాటక రంగానికి రూ.100 కోట్లు
హార్టీ కల్చర్‌కు రూ.250 కోట్లు
గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలనే మిగులు రాష్ట్రాలుగా గుర్తించారు.
481 మంది అమరవీరులకు రూ.48.1 కోట్లు
విద్యార్థుల బకాయిల చెల్లింపు. రూ.2045 కోట్లు
జిల్లా పోలీసు స్టేషన్ల వారి నెలసరి ఖర్చుల కోసం నిధులు
త్వరలో కేజీ టూ పీజీ పథకం.
వాల్మికీ, బోయ, కాయితీ లంబాడీలను ఎస్టీలో చేర్చేందుకు ప్రత్యేక విచారణ సఘం
అజ్మీర దర్గాలో రూ.5 కోట్లతో వసతి గృహం
బంజారాహిల్స్‌లో బంజారా భవన్, ఆదివాసి భవన్
ఈ ఆర్థిక సంవత్సరంలో 9308 చెరువుల పునరుద్ధరణ
ఆర్ అండ్ బీకి రూ.4980 కోట్లు
పంచాయతీ రాజ్‌కు రూ.2421 కోట్లు
బీడీ కార్మికులకు నెలకు రూ.100 పెన్షన్
బీడీ కార్మికుల పెన్షన్ కోసం రూ.186 కోట్లు
యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సంస్థ ఏర్పాటు
యాదగిరి గుట్టకు రూ.100 కోట్లు ఇప్పటికే ఖర్చు. మరో రూ.100 కోట్లు కేటాయింపు
ఆకాశమార్గాలకు (బ్రిడ్జిలకు) రూ.1600 కోట్లు
ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాదుకు 170 ఎంజీడీల నీటి సరఫరా
స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ.712 కోట్లు.
రంజాన్, క్రిస్మస్‌కు రెండు రోజులు సెలవు.
అంగన్ వాడి హెల్పర్లకు జీతాలు పెంపు
అంగన్ వాడీ కార్యకర్తల జీతాలు రూ.4200 నుండి రూ.7000కు పెంపు
వైద్య ఆరోగ్య శాఖకు రూ.4932 కోట్లు
మైనార్టీలకు రూ.1100 కోట్లు
వ్యవసాయకు రూ.2432 కోట్లు
పరిశ్రమలకు రూ.987 కోట్లు
పశు, ఉద్యానరంగాలకు రూ.261 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.2172 కోట్లు
ఎస్టీలకు రూ.2879 కోట్లు
ఎస్సీలకు రూ.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.218 కోట్లు
విద్యారంగానికి రూ.11216 కోట్లు
మిషన్ కాకతీయ, సాగునీటి శాఖకు రూ.8,500 కోట్లు
రుణమాఫీకి రూ.4,800 కోట్లు
పేద యువతులకు వివాహం కోసం కళ్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టాం
రాష్ట్ర విద్యుత్ రంగం పునరుద్ధరణకు తొలి అడుగులు పడ్డాయి.
మరో రూ.4వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
భూక్రమబద్ధీకరణ పథకానికి భారీ స్పందన, ఇది ఒక విప్లవాత్మక మార్పు
కేంద్రం నుండి రావాల్సిన వాటాలో 14 శాతమే వచ్చింది.
విద్యుత్‌కు రూ.7400 కోట్లు
రోడ్ల అభివృద్ధికి రూ.2421 కోట్లు
గ్రేటర్ హైదరాబాదుకు రూ.526 కోట్లు, హైదరాబాదులో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈటెల చెప్పారు.
హైదరాబాద్ నీటి సరఫరాకు రూ.వెయ్యి కోట్లు, ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాదుకు 170 ఎంజీడీల నీటి సరఫరా
హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.410 కోట్లు
యాదగిరి గుట్ట అభివరృద్ధికి రూ.100 కోట్లు
విద్యా రంగానికి రూ.11,216 కోట్లు
అమరవీరులకు రూ.48.12 కోట్లు
అటవీ పర్యావరణ శాఖకు రూ.325 కోట్లు
పశు, ఉద్యాన, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు రూ.261 కోట్లు
తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు రూ.4వేల కోట్లు
మిషన్ కాకతీయకు రూ.2083 కోట్లు
ఈటెల మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు. ఈటెల అమరవీరులకు జోహార్లు అర్పించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపివేసే సమాహారమే ఈ బడ్జెట్ అన్నారు.












Click it and Unblock the Notifications