27న బెజవాడకు సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడ పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 27న సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడ పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 27న సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని సీఎం మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం తెలంగాణ మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇప్పటి వరకు సీఎం కేసీఆర్.. భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల వెంకన్నకు స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించుకున్నారు.












Click it and Unblock the Notifications