తెలంగాణా ఎన్నికల ఫలితాలు: సంతోషంలో చంద్రబాబు!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించాయి. ఈ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయకుండా విరమించుకొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాజా ఎన్నికల ఫలితాలతో సంతోష పడుతున్నారు అన్న చర్చ జరుగుతుంది. తన శిష్యుడు రేవంత్ రెడ్డి హవా కొనసాగడం, బీఆర్ఎస్ కు పరాజయం ఎదురు కావటం చంద్రబాబుకు ఆనందం కలిగించాయి అని చర్చ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు రేవంత్ రెడ్డి లోపాయికారిగా సహాయం చేస్తారని భావన వెరసి టిడిపి అధినేత చంద్రబాబు సంతోషంలో ఉన్నారని చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీలు చంద్రబాబు మనిషిగానే ట్రీట్ చేస్తాయి. ఇక తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు చంద్రబాబును విమర్శించలేదు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన క్రమంలో కూడా చంద్రబాబుకు మద్దతుగా రేవంత్ రెడ్డి అనేకసార్లు వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబు మనిషిననే రేవంత్ రెడ్డి తన మాటల ద్వారా స్పష్టం చేశారు. ఇక ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడం చంద్రబాబుకు ప్లస్ అవుతుంది అన్న భావన వ్యక్తం అవుతుంది.
బీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్సీపి ఇంటర్నల్ గా సహకరిస్తుంది, ఈ రెండు పార్టీల మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని ఎంతోకాలంగా చర్చ జరుగుతున్న వేళ, బిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు బిఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి అంతగా సహకరించే అవకాశం లేదని కూడా చర్చ జరుగుతుంది.
తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనక చంద్రబాబు హస్తం ఉందని భావిస్తున్నారా ..??#Chandrababu #RahulGandhi #RevanthReddy #TelanganaAssemblyElectionResults2023 #ElectionResults #ElectionResults2023 #AssemblyElections2023 #ResultsWithOneindia #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) December 3, 2023
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి ఏపీలో వచ్చే ఎన్నికలకు తనకు సహాయం చేస్తాడని భావిస్తున్న చంద్రబాబు, మార్పు కోరుకుంటూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ మార్పు కోసం కూడా ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వైయస్ జగన్మోహన్ రెడ్డిని షాక్ కు గురి చేయగా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీకి కూడా టిడిపి అభ్యర్థులను నిలపకుండా, వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి కోసమే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడని ప్రచారమైన వేళ, తాజాగా వచ్చిన ఫలితాలు చంద్రబాబుకు సంతోషాన్ని కలిగించాయి.












Click it and Unblock the Notifications