వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ఎక్స్‌ప్రెస్ పేరు మార్పు: వెంకయ్య, నిధుల్లో కోత పెట్టారన్న కెసిఆర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: రెండ్రోజుల్లోగా ఏపి ఎక్స్‌ప్రెస్ రైలు పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ మరో ఎక్స్‌ప్రెస్‌ను ఏపి ఎక్స్‌ప్రెస్ పేరుతో త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు.

మే నాటికి తిరుపతిలో అంతర్జాతీర్జాతీయ ఎయిర్ పోర్టు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు మరమ్మతులు త్వరలోనే పూర్తవుతాయని వెంకయ్య చెప్పారు. ఎన్బీసీ సాయంతో విజయవాడ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపి సమస్యలపై కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, మహేశ్ శర్మలకు వెంకయ్యనాయుడు వివరించారు.

Telangana Express name will change soon: Venkaiah

కేంద్రం పథకాల నిధుల్లో కోత విధించారు: కెసిఆర్

కేంద్రం పథకాల నిధుల్లో కోత విధించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.
నీతి ఆయోగ్ బృందం సభ్యులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం పలు విజ్ఞప్తులు చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధలను సడలించాలని కోరారు.

మిగులు బడ్జెట్ ఉన్న రాష్ర్టాలకు అప్పులు తీసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. అప్పుడే రాష్ర్టాలు అనుకున్న ప్రగతిని సాధింగలవని వివరించారు. రాష్ర్టానికి కేంద్ర నిధులు తగ్గాయి కాబట్టి అప్పులు తీసుకునే వెసులుబాటు మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, స్వచ్చ్ తెలంగాణకు కేంద్రం ఆర్థికసాయం అందించాలని కోరారు.

English summary
Union Minister Venkaiah Naidu on Thursday said that Telangana Express train name will change soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X