తెలంగాణ తొలి గేయ రచయిత రావెళ్ల కన్నుమూత

సంపన్న వ్యవసాయ కుటుంబంలో లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఆయన, చిన్నతనంలోనే అభ్యుదయం వైపు మళ్లాడు. "కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకు బలం.. రజాకార్లను తరిమేస్తే తెలంగాణకు వరం'' అని బదులివ్వడమే ఆయన నోట వెలువడిన తొలి కవితగా మారింది. దేశ్‌ముఖ్‌లు రజాకార్లను ఎదిరించినందుకు జైలు జీవితం అనుభవించారు.
జైలునే సాహిత్య పాఠశాలగా మార్చుకున్నారు. పద్య, వచన, గేయ కవిత్వంలో అనేక అవార్డులు, బిరుదులు పొందిన రావెళ్ల దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ తదితర ప్రముఖుల సహచరుడిగా పేరొందారు. పల్లెభారతి, జీవనరాగం, అనల తల్పం, రాగజ్యోతులువంటి కవితా సంకలనాలు వెలువరించారు. తెలుగు, ఉర్దూల్లో అద్భుతంగా రాయడంతోపాటు అనర్గళంగా మాట్లాడగలగడం రావెళ్ల మరో ప్రత్యేకత.
కాగా.. రావెళ్ల మృతికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సంతాపం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ఆయనకు నివాళి అర్పించారు.












Click it and Unblock the Notifications