తెలంగాణకు అధికారిక చిహ్నాలను ఖరారు చేసిన సీఎం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అధికార జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, పుష్పంగా తంగేడు పువ్వు, వృక్షంగా జమ్మిచెట్టులను ఎంపిక చేశారు.
దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆమోదంతో ప్రభుత్వం సోమవారం అధికారకంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం విజయపథంలో నడవడానికి శుభ సూచికంగా పాలపిట్టను ఎంపిక చేశామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పక్షి -- పాలపిట్ట
తెలంగాణ రాష్ట్ర జంతువు -- జింక
తెలంగాణ రాష్ట్ర పుష్పం -- తంగేడు
తెలంగాణ రాష్ట్ర చెట్టు -- జమ్మి చెట్టు

తెలంగాణకు మేలు జరుగుతుందని జమ్మిచెట్టును, సౌభాగ్యాన్ని కాపాడే విశిష్టత తంగేడు పువ్వుకు ఉంటుందని తెలంగాణ ఆడపడుచులు భావించారని తంగేడు పువ్వును ఎంపిక చేశామని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రాష్ట్ర అధికారక చిహ్నాలను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు పెంపు?
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతం పెంపుపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు రాష్ట్రం తరపు నుంచి అలవెన్స్ కూడా పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రూ. 95 వేలు వస్తోంది. ఐతే వారి జీతాలను రూ. 2 లక్షల వరకు పెంచే యోజనలో ప్రభుత్వం ఉంది. వీటితో పాటు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఫించను కూడా పెంచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications