29వ రాష్ట్రం తెలంగాణ: ఈ విషయాలు తెలుసా?
హైదరాబాద్: తెలంగాణ దేశంలోని 29వ రాష్ట్రంగా ఆదివారం అర్థరాత్రి అధికారికంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్‌గా ఇఎస్ఎల్ నరసింహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు
తెలుసుకోవాల్సిన అంశాలు

జిల్లాలు: హైదరాబాద్, ఆదిలాబపాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్
విస్తీర్ణం: 1.14 లక్షల చ.కి.మీ, దేశంలో 13వ అతి పెద్ద రాష్ట్రం
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 3.52 కోట్లు.
సానుకూలాంశాలు:
విశేషమైన సహజ వనరులు
68 శాతం కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం
79 శాంత గోదావరి నదీ పరీవాహక ప్రాంతం
ఆంధ్ర అటవీ ప్రాంతం తెలంగాణలో 45 శతం ఉంటుంది.
హైదరాబాద్ మాత్రమే ప్రధానంగా పారిశ్రామికంగా, ఇతరత్రా అభివృద్ధి చెందిన నగరం

ప్రతికూలాంశాలు:
చాలా బంజరు భూములు, నక్సలైట్ సమస్య
విద్యుచ్ఛక్తి కొరత
శాంతిభద్రత సమస్య
ఆంధ్రప్రదేశ్
జిల్లాలు: 13 (కోస్తాంధ్ర 9 , రాయలసీమ 4)
కోస్తా జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
రాయలసీమ జిల్లాలు: కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు
విస్తీర్ణం: 1.69 చ.కి.మీ. భారతదేశంలో 9వ అతి పెద్ద రాష్ట్రం.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 5 కోట్లు
సానుకూలాంశాలు:
కోస్తాంధ్ర అభివృద్ధి చెందింది, మౌలిక సదుపాయాలు బాగున్నాయి.
సముద్రతీరం, సారవంతమైన భూములు
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రధాన నగరాలు
మంచి రోడ్డు, రైలు మార్గాలు
విశాఖపట్నం పోర్టు సిటీ, నావల్ బేస్, షిప్ బిల్డింగ్ యార్డు ఉన్నాయి.
విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, కర్నూలు నగరాలను అభివృద్ధి చేయడానికి వీలుంది.
ప్రతికూలాంశాలు:
ఉత్తరాంధ్రలో నక్సలైట్ సమస్య
ఉత్తరాంధ్ర జిల్లాల వెనకబాటు తనం
రాయలసీమలో ఫ్యాక్షనిజం, వెనకబాటు తనం












Click it and Unblock the Notifications