వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంగా కెసిఆర్ ప్రమాణం, మంత్రిగా నాయని

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తొలి తెలంగాణ మంత్రిగా కె. చంద్రశేఖర రావు ప్రమాణం స్వీికారం చేశారు. గవర్నర్ నరసింహన్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. దైవసాక్షిగా కెసిఆర్ ప్రమాణం చేశారు.

మంత్రులుగా ప్రమాణం వీరే

మహిళలకు ఎవరికీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు.

జి. జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

జోగు రామన్న మంత్రిగా ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కల్వకుంట్ల తారక రామారావు మంత్రిగా ప్రమాణం చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. నాలుగోసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

టి. పద్మారావు మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన హైదరాబాదులోని సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

టి హరీష్ రావు మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరవ సారి శాసనసభ్యుడిగా గెలిచారు.

ఈటెల రాజేందర్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన 2009 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెరాస శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

నాయని నర్సింహా రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన ఎమ్మెల్సీ గానీ, ఎమ్మెల్యేగానీ కారు.

మంత్రిగా వరంగల్ జిల్లాకు తాటికొండ రాజయ్య మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నిక్యయారు. ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి కోదండరామ్‌కు ఆహ్వానం అందినట్లు తాజా సమాచారం. చివరి నిమిషంలో ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం.

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందలేదు. ఎన్నికల్లో తెరాసకు ఓటేయాలని స్పష్టంగా ప్రకటన చేయడమే ఇందుకు కారణమని అంటున్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన రాజయ్యను డిప్యూటీ సిఎంగా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. అయితే, ఆ విషయం ఇంకా ఖరారు కాలేదు. నిజానికి కొప్పుల ఈశ్వర్‌కు ఈ పదవి దక్కుతుందని భావించారు. కానీ, ఆయనను డిప్యూటీ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సోమవారం ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.

కెసిఆర్‌తో పాటు 12 మంది మంత్రులు ప్రమాణం స్వీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి మహేందర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.

కెసిఆర్ రాజభవన్‌కు చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేేసేవారి పేర్లను కెసిఆర్ అత్యంత గోప్యంగా ఉంచారు .దీనికి గల కారణం ఏమిటనేది తెలియడం లేదు.

Telangana: KCR swearing - in cerremony

మంత్రులుగా ప్రమాణం చేసేది వీరే?

హరీష్ రావు
మహమూద్ అలీ
మహేందర్ రెడ్డి
జోగు రామన్న
ఈటెల రాజేందర్
నాయని నర్సింహారెడ్డి
జోగు రామన్న
రాజయ్య
పోచారం శ్రీనివాస రెడ్డి
పద్మారావు
జగదీశ్వర్ రెడ్డి
కెటి రామారావు

English summary
Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar to take oath as Telangana first CM. He paid homage to the martyrs at gun park in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X