హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనవరి నాటికి టి?: డిగ్గీ ఫోన్, ప్రణబ్‌తో సోనియా భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: జనవరి నెల నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలతో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. దిగ్విజయ్ టి నేతలకు ఫోన్ చేసి నవంబర్ 15లోగా ముసాయిదా బిల్లు వస్తుందని, జనవరి నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని చెప్పారట. ప్రజలలోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

డిసెంబర్ 7న తెలంగాణ బిల్లు

డిసెంబర్ 7వ తేదీన పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వస్తుందని కేంద్రమంత్రి బలరాం నాయక్ వరంగల్ జిల్లాలో అన్నారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాలలోనే జరుగుతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం ఖాయమన్నారు.

Telangana soon: Diggy

రాష్ట్రపతితో సోనియా భేటీ

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. విభజన నిర్ణయం, తెలంగాణ బిల్లు త్వరలో పార్లమెంటులో ప్రవేశ పెడతారనే వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అంశం పైనే సోనియా చర్చించారని తెలుస్తోంది.

మొయిలీతో గవర్నర్ భేటీ

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం కేంద్రమంత్రి, జివోఎం సభ్యుడు వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. అంతకుముందు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో , కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావుతో భేటీ అయ్యారు.

English summary
AP Congress Party incharge Digvijay Singh on Thursday called Telangana Congress leaders and told them Telangana will soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X