హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్వేతో జాక్‌పాట్: రూ500 కోట్లు! చిరు కోసం వెయిటింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Telangana survey: GHMC strikes gold
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే.. జీహెచ్ఎంసీకి భారీగా డబ్బులు తేనుంది! తాజా సర్వేలో వెల్లడైన కొన్ని వాస్తవాలతో జీహెచ్ఎంసీకి దాదాపు రూ.500 కోట్ల ఆదాయం పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 2001-02లో ఇంటి పన్నుల రూపంలో సంబంధింత సంస్థ రూ.130 కోట్లు వసూలు చేసింది. జీహెచ్ఎంసీగా మారక 2012-13లో రూ.825 కోట్లు వస్తున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం రికార్డ్ స్థాయిలో రూ.1050 కోట్లు వసూలైంది. ప్రస్తుతం 12.50 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థల నుంచి పన్ను వసూలు చేపడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల నగరంలో అనేక ఇళ్లు కత్తగా వెలుగులోకి వస్తున్నాయి. 15 లక్షలకు పై చిలుకు ఇళ్లు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇళ్ల సంఖ్య దాదాపు 23 లక్షళకు చేరే అవకాశముందంట.

ప్రస్తుతం 12.50 లక్షల ఇళ్ల పైన పన్ను విధించడం ద్వారా రూ.1050 కోట్లను వసూలు చేశారు. సర్వే విరాల ఆధారంగా వెలుగులోకి వస్తున్న 10 లక్షళ ఇళ్ల పరిశీలనకు జీహెచ్ఎంసీ సిబ్బందిని పంపించి సంబంధిత ఇళ్లు ఎంత విస్తీర్ణంలో నిర్మాణమయ్యాయని అంచనా వేసి దానికి అనుగుణంగా పన్ను విధించే యోచనలో ఉన్నారట. తద్వారా రూ.500 కోట్లు జీహెచ్ఎంసీకి రాబడి ఎక్కువగా రానుందంటున్నారు.

కాగా, సర్వేల్లో ప్రముఖులు తమ వివరాలు ఇచ్చారు. గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో సర్వే పత్రాన్ని స్వయంగా నింపి ఎన్యూమరేటర్లకు అందించారు. తమ కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర అంశాలను ఆయన ఇచ్చారు. సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసంలో సర్వే వివరాలు నమోదు చేయించుకున్నారు. మెదక్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రం, బంజారాహిల్స్ నందినగర్‌లోని తన ఇళ్లు, ఇతర ఆస్తుల వివరాలను అందించారు. బ్యాంకులో డిపాజిట్లు, ఖాతాల సమచారాన్ని ఇచ్చారు.

కేటీఆర్ సైతం కేసీఆర్ నివాసంలోనే సర్వే పత్రాలు ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు సమాచారాన్ని సర్వే సిబ్బంది నమోదు చేసింది. చంద్రబాబు ఇంటికి ఉదయం వెళ్లగా ఆయన శాసన సభకు వెళ్లినట్లు చెప్పారు. అయితే, పత్రాలు అన్ని ఇచ్చి అసెంబ్లీకి వెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబు కుటుంబం కూడా అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత కార్యదర్శి నుంచి సమాచారం తీసుకున్నారు.

బాలకృష్ణ ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరని, సాయంత్రంలోపు వస్తారని, వివరాలు అందిస్తామని అక్కడున్న సిబ్బంది నోడల్ అధికారికి సమాచారం ఇచ్చారు. కాగా, చిరంజీవి సర్వేలో వివరాలు అందించారు. ఆయన పిలుపు కోసం సర్వే సిబ్బంది 20 నిమిషాలు వెయిట్ చేశారు. పవన్ కళ్యాణ్ సర్వే సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.

English summary
The visit for the Intensive Household Survey to be a jackpot for Greater Hyderabad Municipal Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X