పట్టించుకోవద్దు: బాబు ముందు కేసీఆర్‌పై సెటైర్లు, నవ్వించారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో శనివారం భేటీ అయిన తెలంగాణ టీడీపీ నేతలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డారు. ఆయన పైన సెటైర్లు విసిరారు.
తెలంగాణ సీనియర్ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డిలు విలేకరుల సమావేశంలో, చంద్రబాబు ఎదుట కేసీఆర్ పైన చురకలు వేశారు.
ఎర్రబెల్లి దయాకర రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుల గురించి ఓ కథ చెప్పి ఆకట్టుకున్నారు.

టీడీపీ
మా సీఎం మూర్ఖుడని, ఆయన మాటలు పట్టించుకోవద్దని, తెలంగాణలో రైతులు విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారని, ఆత్మహత్య చేసుకుంటున్నారని, మీ మనసు మంచిదని, మీరు ఏపీ కోసం కొన్న కరెంటును తమకు ఇచ్చి ఆదుకోవాలని ఎర్రబెల్లి దయాకర రావు ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పారు.

ఎర్రబెల్లి
తన ప్రసంగంలో ఎర్రబెల్లి ఓ కథను వినిపించారు. 'ఈ మధ్య హరీష్ రావు, కేటీఆర్ కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లారట. కేటీఆర్, కేసీఆర్‌తో మాట్లాడుతూ.. శ్రీశైలంలో మన విద్యుదుత్పత్తి నిలిపివేస్తే 300 మెగావాట్లు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. మనం డిమాండ్ చేస్తే 1000 మెగావాట్లు ఇస్తారు. ఏం చెద్దామని ప్రశ్నించాడు. అప్పుడు కేసీఆర్.. మనం డిమాండ్ చేస్తే బాబు ఇస్తాడు. పంటలు బాగుంటాయి. అప్పుడు బాబు కరెంట్ ఇస్తే మనం గట్టెక్కామని రైతులు అనుకుంటారు. అదే పొలాలు ఎండిపోతే బాబుపై తప్పు నెట్టవచ్చు' అని హితోపదేశం చేశాడట అని ఎర్రబెల్లి కథ చెప్పారు.

మోత్కుపల్లి
తెలంగాణలో ప్రజలకు విప్లవ భావాలు ఎక్కువ అని, కేసీఆర్ తతంగం ఇక్కడ ఇంకా ఎన్నాళ్లో సాగదని, కేసీఆర్‌ను ఏవిధంగా గద్దె దింపాలా అని ఆలోచిస్తున్నారని, కేసీఆర్ సినిమా అయిపోయిందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే తెరాసకు డిపాజిట్ కూడా దక్కదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

రావుల చంద్రశేఖర్ రెడ్డి
కేసీఆర్ రాష్ట్రానికి చిహ్నాలుగా ఇటీవలే పువ్వు, పక్షి, చెట్టు, జంతువును ప్రకటించారని, దాంతో పాటు ఒక తిట్టు, ఒక ఊతపదం కూడా ప్రకటిస్తే సరిపోయేదని, కేసీఆర్ ఎప్పుడువాడే 'సన్నాసి' అనే పదాన్ని తెలంగాణ తిట్టుగా, ఏది మాట్లాడినా ఆయన నోటి నుండి వచ్చే 'అద్భుతమైన' అనే పదాన్ని రాష్ట్ర ఊతపదంగా ప్రకటించాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి సెటైర్ వేసి నవ్వించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications