వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు అకాడమీ స్కామ్ : 71 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల గల్లంతు; నిధుల గోల్ మాల్ పై లక్ష్మీపార్వతి సంచలనం

|
Google Oneindia TeluguNews

తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ల గోల్ మాల్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు అకాడమీ లో తాజాగా 71 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ల గల్లంతు జరిగినట్టు పోలీసులు గుర్తించారు . రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ జరగాలన్న సుప్రీం ఆదేశాలతో నిధుల పంపకాలకు రంగంలోకి దిగిన తెలుగు అకాడమీ బ్యాంకులలో నిధుల గోల్ మాల్ తో షాక్ అయ్యింది. మొదట నలభై మూడు కోట్ల నిధులు గల్లంతైనట్లు భావించినా ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అనేక అక్రమాలతో 71 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

 తెలుగు అకాడమీ నిధుల గల్లంతుపై విచారణ

తెలుగు అకాడమీ నిధుల గల్లంతుపై విచారణ

యూనియన్ బ్యాంకు కార్వాన్ శాఖ నుంచి 43 కోట్లు, సంతోష్ నగర్ బ్రాంచ్ నుండి ఎనిమిది కోట్లు, చందానగర్ కెనరా బ్యాంకు నుండి తొమ్మిది కోట్లు గల్లంతైనట్లుగా ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ప్రధాన సూత్రధారితోపాటు మరో అనుమానితుడిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలుగు అకాడమీలో కొందరు అధికారులు బ్యాంకు అధికారులతో చేతులు కలిపి నిధులు కాజేసినట్లుగా విచారణలో తెలిసింది. ఇక తెలుగు అకాడమీ నిధులు గోల్ మాల్ కు సంబంధించి తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్ ల విషయంలో బ్యాంకు అధికారులు డబ్బులు లేవని చెప్పటంతో మూడు ఫిర్యాదులు ఇచ్చారు.

డిపాజిట్ల అక్రమాలపై త్రిసభ్య కమిటీ .. రేపటిలోగా ప్రభుత్వానికి రిపోర్ట్

డిపాజిట్ల అక్రమాలపై త్రిసభ్య కమిటీ .. రేపటిలోగా ప్రభుత్వానికి రిపోర్ట్


ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిధులు మాయం చేసిందెవరు ? మాయమైన నిధులను ఎక్కడికి తరలించారు? దీని వెనుక వున్న మెయిన్ లీడర్స్ ఎవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ బ్యాంకు ఖాతాల నుండి నిధులు బదిలీ అయిన ఇతర బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్, అగ్రసేన బ్యాంక్ ప్రతినిధులను పోలీసులు విచారించారు. నేడు మరోమారు బ్యాంకు ప్రతినిధులను, తెలుగు అకాడమీ ఉద్యోగులను విచారించనున్నారు. ఈ కుంభకోణంలో ఇంటి దొంగల ప్రమేయం ఉందని అంటున్నారు. ఇక తెలుగు అకాడమీ కి సంబంధించి ఫిక్స్ డ్ డిపాజిట్ల అక్రమాల నిగ్గు తేల్చడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2 లో ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన డబ్బులు వారంరోజుల్లో బదిలీ చెయ్యాలన్న సుప్రీం ధర్మాసనం

ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన డబ్బులు వారంరోజుల్లో బదిలీ చెయ్యాలన్న సుప్రీం ధర్మాసనం

ఇటీవల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు అకాడమీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తెతెలుగు అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన డబ్బులు వారంరోజుల్లో బదిలీ చేయాలని సెప్టెంబర్ 15 న జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ క్రమంలో నిధుల బదిలీ చెయ్యటానికి అంగీకరించిన ఏపీ ప్రభుత్వం నిధులను లెక్కిస్తున్న క్రమంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

డబ్బులు విత్ డ్రా చెయ్యాలని అకాడమీ ప్రయత్నం .. డబ్బులు లేవన్న బ్యాంకులు

డబ్బులు విత్ డ్రా చెయ్యాలని అకాడమీ ప్రయత్నం .. డబ్బులు లేవన్న బ్యాంకులు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలుగు అకాడమీలో ఉన్న 213 కోట్ల రూపాయల నిధులలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధమైంది. ఈ క్రమంలో వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యూబీఐ కార్వాన్, సంతోష్ నగర్ శాఖలో 43 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయని గుర్తించిన తెలుగు అకాడమీ అధికారులు వాటిని విత్ డ్రా చేయాలని ప్రయత్నించగా అసలు బ్యాంకులో డబ్బులు లేవు అని తెలియడంతో తెలుగు అకాడమీ అధికారులు అవాక్కయ్యారు.

 తెలంగాణా తెలుగు అకాడమీ ఉద్యోగుల హస్తం ఉందని లక్ష్మీ పార్వతి సెన్సేషన్

తెలంగాణా తెలుగు అకాడమీ ఉద్యోగుల హస్తం ఉందని లక్ష్మీ పార్వతి సెన్సేషన్


దీంతో తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్లు గల్లంతు అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీగ లాగితే డొంకంతా కదులుతున్న చందంగా తెలుగు అకాడమీ వ్యవహారంలో మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రానున్నట్టు విచారణ చేస్తున్న పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ తెలుగు అకాడమీ హస్తం ఉన్నట్టు ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా లేక అకాడమీ సిబ్బంది నిర్లక్ష్యం ఉందా అనేది కమిటీ తేలుస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Recommended Video

'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
ఎవరి వాటాలు వాళ్ళు వెంటనే పంచుకుంటే ఈ సమస్య వచ్చేది కాదన్న లక్ష్మీ పార్వతి

ఎవరి వాటాలు వాళ్ళు వెంటనే పంచుకుంటే ఈ సమస్య వచ్చేది కాదన్న లక్ష్మీ పార్వతి

నిధులు మాయం కావడంలో బ్యాంకుల పాత్ర కూడా కనిపిస్తోందని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన వెంటనే ఎవరి వాటా వాళ్లకు పంచితే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావని, 58:42 రేషియో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 58 శాతం వాటా రావాలని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కుంభకోణం నేపథ్యంలో నిధుల పంపకం ఎప్పటికి జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం వాటాల పంపకం జరుగుతుందన్న లక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటిన్నర సంవత్సరంలోనే అకాడమీని చాలా ముందుకు తీసుకు వచ్చామని, త్వరలో తిరుపతి వేదికగా తెలుగు అకాడమీ కార్యాలయం ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.

English summary
Police have found Rs 71 crore worth of fixed deposits have been misappropriated in the Telugu Academy. Lakshmi Parvathi alleges that the Telangana Telugu Academy was involved in this. The govt will set up a committee to look into the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X