వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై పృధ్వీ సంచలన సెటైర్లు- కల్తీ మనుషులను నమ్మొద్దంటూ...

|
Google Oneindia TeluguNews

నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉండకపోతే థర్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి రోజు గడవదు. గతంలో టాలీవుడ్ కమెడియన్ గా ఉన్నప్పుడు టీడీపీ నేతల మీద, ఎస్వీబీసీ ఛైర్మన్ గా పనిచేస్తున్నప్పుడు అమరావతి ఉద్యమంపైనా, ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా జగన్ పైనా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా టిక్ టాక్ వీడియో ద్వారా ఆయన చేసిన కల్తీ మనుషులు వ్యాఖ్యలు టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం కలకలం రేపుతున్నాయి.

థర్ట్ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న బాలిరెడ్డి పృధ్వీరాజ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఓసారి గమనిస్తే ఆయన ఎవరిని టార్గెట్ చేశారో ఇట్టే అర్ధమవుతోంది. ఇంతకీ పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను ఓసారి యథాతథంగా చూస్తే " అన్నా మన అని ఎవరినీ నమ్మొద్దు, ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు. కల్తీనాకొడుకులు ఏలుతున్న కలియుగం, మనముందు మన మాట మాట్లాడతారు, వాడి ముందు వాడి మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి."

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన పాలకులపై సెటైర్ వేసినట్లే ఉంది. ఆయన స్ధానికంగా ఉండే ఏపీలో ఇప్పుడు పాలకులుగా ఉన్నది వైసీపీ ప్రభుత్వం... దానికి అధినేతగా ఉన్నది జగన్‌. కానీ పృధ్వీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న దానిపైనే ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది.

telugu comedian prudhvi raj sensational comments on cm jagan

రాసలీలల వ్యవహారంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కోల్పోయిన పృధ్వీ కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నారు. పదవుల కోసం ఆయన ఎక్కని వైసీపీ నేతల గడప లేదు. ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయాక చివరిగా వివాదాస్పద కామెంట్స్ తో అయినా జగన్ దృష్టిలో పడాలని ఈ వీడియోలో ఆయన ఇలా మాట్లాడారా అన్న అనుమానాలు మాత్రం ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

English summary
tollywood comedian and former svbc chairman prudhviraj made sensational comments on cm jagan and ysrcp government in andhra pradesh with his latest tiktok video. in this, prudhviraj allegedly says that not to believe fake leaders in this kaliyuga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X