వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నాలుగు జిల్లాల్లో గెలుపే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు వ్యూహ‌ర‌చ‌న‌

|
Google Oneindia TeluguNews

రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల్లో గెలుపే ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహర‌చ‌న చేస్తున్నారు. ఉమ్మ‌డి క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో పార్టీ జెండాను రెప‌రెప‌లాడించ‌డంద్వారా అధికార పార్టీని ఆత్మ‌ర‌క్షణ ధోర‌ణిలోకి నెట్టేయాలనేది బాబు వ్యూహంగా ఉంది. ఈ నాలుగు జిల్లాల్లో వైసీపీకి గ‌ట్టి ప‌ట్టుంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘ‌న‌విజ‌యాన్ని క‌ట్టబెట్ట‌డంలో వీటిది ప్ర‌త్యేక పాత్ర‌. అటువంటి జిల్లాల‌పై బాబు దృష్టిసారించ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు.

 కుప్పంలో బాబును ఓడించడంద్వారా టీడీపీకి చెక్!

కుప్పంలో బాబును ఓడించడంద్వారా టీడీపీకి చెక్!

కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈసారి చంద్ర‌బాబును ఓడించ‌డంద్వారా తెలుగుదేశం పార్టీని పూర్తిగా డిఫెన్స్ లో పడేయాల‌నే వ్యూహంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా స్థానిక టీడీపీ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకొని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని ద‌క్కించుకున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుపై ఎమ్మెల్సీ భ‌ర‌త్ పోటీచేస్తారంటూ ఇప్ప‌టికే మంత్రి పెద్దిరెడ్డి ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబుపై రెండుసార్లు పోటీచేసి ఓట‌మిపాలైన చంద్ర‌మౌళి కుమారుడే భ‌ర‌త్‌.

 రాయలసీమలో వైసీపీని ఓడించడంద్వారా వైసీపీకి చెక్!

రాయలసీమలో వైసీపీని ఓడించడంద్వారా వైసీపీకి చెక్!

కుప్పంలో త‌న‌ను ఓడించ‌డానికి వైసీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలకు చంద్ర‌బాబు చెక్ పెట్టాల‌నే యోచ‌న‌తో పూర్తిగా రాయ‌ల‌సీమ‌పైనే దృష్టిపెట్టారు. ఇక్కడ జరిగిన మినీ మ‌హానాడుల‌కు, బాదుడే బాదుడు ప‌ర్య‌ట‌న‌ల‌కు ఇక్క‌డి నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింద‌ని, దీన్ని నాలుగు జిల్లాలకు విస్తరించడంద్వారా వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఒక్క కుప్పంపైనే దృష్టిపెట్టిన వైసీపీని పూర్తిగా డిఫెన్స్ లో ప‌డేయాల‌ంటే.. నాలుగు జిల్లాల్లో వైసీపీని ఓడించడం ఒకటే మార్గమనే నిర్ణయానికి బాబు వచ్చారంటున్నారు.

ముందుగా అభ్యర్థులను ప్రకటించడంకూడా వ్యూహమే!

ముందుగా అభ్యర్థులను ప్రకటించడంకూడా వ్యూహమే!


రాయ‌ల‌సీమ‌లో లోక్‌స‌భ‌కు, అసెంబ్లీకి పోటీచేసే కొంద‌రు అభ్య‌ర్థుల‌ను బాబు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాత్సార ధోర‌ణి లేకుండా కొన్ని నియోజకవర్గాల్లో ముందుగానే ప్ర‌క‌టిస్తే అసంతృప్తితో ఉన్న‌వారెవ‌ర‌నేది అర్థ‌మ‌వుతుంద‌ని, దాన్నిబ‌ట్టి ఎన్నికల ప్ర‌ణాళిక‌లు ర‌చించొచ్చ‌ని చంద్రబాబు భావిస్తున్నారు. నువ్వొకటంటే నేను రెండంటా.. అనే రీతిలో తెలుగుదేశం, వైసీపీ వ్యూహరచన చేస్తుండటం, ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంద్వారా ఇప్పటికీ రాయలసీమలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ అనుకున్నట్లుగా కుప్పంలో చంద్రబాబును ఓడిస్తుందా? టీడీపీ అనుకున్నట్లుగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో విజయం దక్కించుకుంటుందా? ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఎటువైపు ఉంటారనే విషయాలపై స్పష్టత రావాలంటే కొద్దికాలం వేచిచూడక తప్పదు.!!

English summary
Chandrababu's idea is to put a check on YCP's plan to defeat him in the heap by winning the four districts of Rayalaseema in the upcoming elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X