అందరి చరిత్ర నా దగ్గరుంది.. తర్వాత మీ ఇష్టం!!

అవకాశాలు కల్పించిన పార్టీ టీడీపీ ఒక్కటేనన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని, ఎవరూ వ్యక్తిగత దూషణలు చేయలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాన్ని మాత్రం ఇంతవరకు చూడలేదని వ్యాఖ్యానించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న ఎంతోమంది సమర్థులకు అవకాశాలు కల్పించి ఏపీ, తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పాటుపడిందన్నారు.

 రుషికొండను బోడికొండగా చేశారు

రుషికొండను బోడికొండగా చేశారు


రుషికొండను పూర్తిగా తవ్వేసి బోడికొండను చేశారని, ఈ అంశంపై ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుంటే మరోవైపు కొండను పూర్తిగా తవ్వేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం తాము పూర్తిచేశామని, దాన్ని ముంచేశారని, రాజధాని అమరావతి కోసం రైతులు 35వేల ఎకరాలిచ్చారని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా ల్యాండ్ ఫూలింగ్ విధానం తీసుకొచ్చామన్నారు.

అప్పుడు సరే అన్నారు..ఇప్పుడేమో..

అప్పుడు సరే అన్నారు..ఇప్పుడేమో..


అమరావతికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ సరే అన్నారని, చిన్న రాష్ట్రం, విభేదాలు వద్దని అప్పుడు చెప్పి ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడతున్నారని, ధర్మం, న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతోందని, నేరగాళ్లను కట్టడి చేసేందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. దీనికి న్యాయవాదుల సహకారం కావాలన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఇద్దరు మరణించారని, అప్రూవర్ గా మారిన దస్తగిరికి ముప్పు పొంచివుందని, ఏపీలో ప్రజలకు రక్షణ లేదని, ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు.

సామాన్యుల పరిస్థితి దారుణం..

సామాన్యుల పరిస్థితి దారుణం..


ఒక ఎంపీకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశంలోనే అద్భుతమైన ఏపీ పోలీసు వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, తనదగ్గర అందరి చరిత్ర ఉందని, ఎవరూ తప్పించుకోలేరని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద అధికారి అయినా తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వివిధ జిల్లాల నుంచి న్యాయవాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+