అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోటంరెడ్డి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్?

వైసీపీ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు చేయించేవారని తెలుగు తమ్ముళ్ల ఆరోపణ.

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ పై ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నానని తన అనుచరులకు చెప్పడమే కాకుండా మీడియా సమావేశంలో కూడా ప్రకటించారు. దీంతో నెల్లూరు జిల్లా టీడీపీలో చర్చ ప్రారంభమవగా వైసీపీ.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది.

స్పందించని సైకిల్ నేతలు

స్పందించని సైకిల్ నేతలు

నెల్లూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ ఛార్జి అబ్దుల్ అజీజ్ నుంచి ఇంతవరకు స్పందన వెలువడలేదు. కోటంరెడ్డిని ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా ఇతర నేతలెవరూ ఇంతవరకు మాట్లాడలేదు. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆత్మకూరు, నెల్లూరు సిటీ, వెంకటగిరి.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి లేదంటే నెల్లూరు ఎంపీగా పోటీచేసే అవకాశం ఉంది.

కోటంరెడ్డి విషయంలో చర్చలు

కోటంరెడ్డి విషయంలో చర్చలు


ఆనం రాకను టీడీపీ నేతలెవరూ వ్యతిరేకించడంలేదు. కానీ కోటంరెడ్డి విషయంలో మాత్రం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడేవారు.ఇప్పుడు ఆహ్వానిస్తున్నట్లుకానీ, వ్యతిరేకిస్తున్నట్లుకానీ ఏమీ చెప్పడంలేదు. కోటంరెడ్డి వస్తే పార్టీకి లాభమా? నష్టమా? అనేది ఈ నాయకులు విశ్లేషిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్ చార్జిగా ఉన్న అబ్దుల్ అజీజ్ ఉన్నారు. గత ఎన్నికల్లో కోటంరెడ్డిపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. చంద్రబాబునాయుడు ఇన్ ఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని తీసుకునే క్రమంలో పార్టీ నేతలతో సంప్రదిస్తారు కాబట్టి అది కోటంరెడ్డి సొంత ప్రకటన అని, కోటంరెడ్డి టీడీపీ నేతలపై దాడులు చేయించారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే..

ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే..


రూరల్ ఇన్చార్జిగా ఉన్న అజీజ్ కు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కాబట్టి అధినేతతో దీనిపై కోటంరెడ్డి చర్చించి ఉండరని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఇంకోవార్త ప్రచారంలో ఉంది. తన అనుచరులకు భరోసా కల్పించేందుకే ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ నుంచి పోటీచేస్తానని చెప్పి ఉండొచ్చని, వారిని కాపాడుకోవడానికే ఈ ప్రకటన చేశారని విశ్లేషిస్తున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇంతవరకు పెదవి విప్పకపోవడ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ అధిష్టానం ప్రకటన చేస్తుందా? టీడీపీ నేతల నుంచి స్పందన వస్తుందా? అనే ప్రశ్నలకు ప్రస్తుతం జవాబులు లేవు.

English summary
YSR Congress Party Nellore Rural MLA Kotam Reddy Sridhar Reddy affair has become a hot topic in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X