"దేశ భాషలందు తెలుగు లెస్స".. తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు !

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా...

పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు

అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు

ఉగ్గుపాల భాష పలికేందుకు
సిగ్గుపడకురా... వెనక్కి తగ్గమాకురా.

ఈ వచనాలు ఒక తెలుగు సినిమాలో తెలుగు భాష ప్రాముఖ్యతను.. నేటి కాలంలో పరిస్థితిని కళ్లకు కట్టినట్టు అభివర్ణించారు. మన పూర్వికులు నుంచి చెప్తున్న మాట "దేశ భాషలందు తెలుగు లెస్స". కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వందల కొద్దీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే తప్పు. ఇది ప్రస్తుతం ఉన్న దుస్థితి.

telugu-language-day-wishes-from-ap-cm-and-deputy-cm-minsiters

తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కొనియాడారు. తేనెలొలుకు భాష.. మన తెలుగు భాష అంటూ కీర్తించారు. అమ్మతనంలో ఉండేంత కమ్మదనం ఉండే తెలుగు భాషను నానాటికి కనుమరుగు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పక్క రాష్ట్రాలు సైతం తమ మాతృభాష కోసం ఎంతగానో తపిస్తూ ఉద్యమాలకు సైతం వెనుకడుగు వేయని తరుణంలో మన రాష్ట్రాల్లో మాత్రం పట్టించుకునే వారే కరువయ్యారు.

చరిత్ర..

అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించింది. ప్రతి ఏడాది ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వేడుకను జరుపుకుంటారు. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చడంలో.. ఎంతగానో కృషిచేసిన గిడుగు వెంకట రమమూర్తి పంతులు.. జన్మదినోత్సవం సందర్భంగా నేడు ఈ తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్నాం.

మరోవైపు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఏపీ గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం.. మంత్రులు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా 'ఎక్స్‌' వేదికగా తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు వెంకట రామ్మూర్తి కారణంగానే ఈరోజు మనం ఎన్నో పుస్తకాలు, పత్రికలను మనకు అర్థమయ్యే తెలుగులో చదవగలుగుతున్నామన్నారు. తెలుగువారిగా మనందరం ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవాలన్నారు.

తెలుగు వెలగాలి - నారా లోకేశ్

తెలుగు వెలగాలి, తెలుగు భాష వర్థిల్లాలి అని మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తెలుగు భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు వికాసానికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జనసేన..

వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ తరపున ఘననివాళులు అర్పిస్తూ, తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగులో మాట్లాడుదాం - తెలుగు భాషను పరిరక్షించుకుందాం అని పిలుపునిచ్చారు.

వైఎస్ జగన్..

తెలుగు వ్య‌వ‌హారిక భాషోద్య‌మ పితామ‌హుడు గిడుగు వెంక‌ట రామ‌మూర్తి. ఆయన జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+