టీడీపీని మీరేం చేయలేరు: పవన్-జగన్-మోడీలపై ఫైర్, 'పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు'
Recommended Video

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీలు కలిసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని అన్నారు. టీడీకి ప్రజలు అండగా ఉంటారని చెప్పారు.
కేంద్రంపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో ప్రధాని నరేంద్ర మోడీకి దడ పుట్టుకుందని మంత్రులు విమర్శించారు. హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారన్నారు. అవిశ్వాసంపై చర్చను జరగనివ్వాలని లేదంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లే అన్నారు.

విశ్వాస నాయకుడిని వదిలేశామని గ్రహిస్తుంది
జనసేన ఆవిర్భావ సభలో టీడీపీపై, మంత్రి లోకేష్ పైన పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద మంత్రి జవహర్ స్పందించారు. ఇతరులు అంటేనే తాను అన్నానని పవన్ ఒప్పుకున్నారని చెప్పారు. విశ్వాసమైన నాయకుడిని వదులుకున్నామని బీజేపీ త్వరలో గ్రహిస్తుందన్నారు. స్థానిక బీజేపీ నేతలు ఆముదం చెట్ల వంటి వారని, తమకు తాము మర్రిచెట్లుగా అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ప్రకటన విడుదల చేశారు
2019 ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తాయని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ, వైసీపీల మధ్య వారధిలా మారారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ సమావేశంలో పాల్గొనడంతో వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తేలిపోయిందని చెప్పారు. ఆర్థిక నేరలు ఉన్న వైసీపీకి బీజేపీ దగ్గర కావడం నీతిబాహ్యమైన చర్య అన్నారు.

బీజేపీ ఎంపీలు తిరుగుబాటు చేసే పరిస్థితి
వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏకు ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు తన బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వహించారని బుద్ధా వెంకన్న వేరుగా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఎంపీలు తిరుగుబాటు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

గంటలోపే మాకు మద్దతు
లోకసభలో తొలుత వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి పెద్దగా మద్ధతు లభించలేదని, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఒక గంటలోనే వివిధ పార్టీలకు చెందిన 151 మంది ఎంపీలు మద్ధతు లభించిందని బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్, బీజేపీ సమావేశానికి హాజరు కావడం చూస్తే ఆయన ఆ రెండు పార్టీల అనుసంధాన కర్త పాత్ర పోషిస్తున్నట్లుగా ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ వారి మద్దతు కూడగడతారా
అవిశ్వాస తీర్మానం కోసం దేశంలోని ఎంపీల మద్దతును తాను కూడగడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని, ఏపీలోని ఇద్దరు బీజేపీ లోకసభ సభ్యుల మద్దతు మీరు పొందగలరా అని జనసేనానిని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications