తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్-జేసీ బ్రదర్స్ హౌస్ అరెస్ట్..

ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జేసీ బ్రదర్స్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరై సైలెంట్ అయిపోయారు. జేసీ బ్రదర్స్ లో ఒకరైన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోగా.. ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జేసీ బ్రదర్స్ స్ధానికంగా ఓ రథోత్సవానికి హాజరయ్యేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు.

తాడిపత్రిలో ఆలూరుకోన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రథోత్సవానికి జేసీ సోదరులు ఇవాళ బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్న క్రమంలో పోలీసులు వీరిని వెళ్లనీయలేదు. దీంతో జేసీ బ్రదర్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వారిని వదల్లేదు. చివరికి వీరిద్దరినీ హౌస్ అరెస్టు చేశారు.

tadipatri with tdp leaders jc brothers

తాడిపత్రిలో పోలీసుల హంగామా తర్వాత జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఇంట్లోకి వెళ్లిపోయినా పోలీసులు మాత్రం అక్కడే కాపలాగా ఉన్నారు. ఏ క్షణమైనా జేసీ బ్రదర్స్ బయటికి వస్తారన్న అనుమానంతో పోలీసులు ఇక్కడ కాపలా కాస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తాడిపత్రిలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీతో జేసీ బ్రదర్స్ కు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో పోలీసులకు కూడా సమస్యలు తప్పడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+