ఓయులో అదే టెన్షన్, కేసీఆర్‌పై ఫైర్: దాడిపై టీడీపీ లేఖ

విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి కోసం బయలుదేరగా.. పోలీసులు ఓయు గేట్లు మూసివేశారు. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే తమ జీవితాలు బాగుపడతాయనుకుంటే.. ఈ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు. ఓయు గేటు వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విద్యార్థులు పోలీసుల పైన రాళ్లు రువ్వారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థుల పైన స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లించారు.
కాగా, తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీని పైన విద్యార్థులు భగ్గుమంటున్నారు. వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటుచేసి, కొత్త ఉద్యోగాలకు నోటిఫకేషన్ విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
సభాపతికి తెలంగాణ టీడీపీ లేఖ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సభాపతి మధుసూదనా చారికి లేఖ రాశారు. తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటి పైన దాడిని సభాపతి దృష్టికి తీసుకు వెళ్లారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద భద్రత కల్పించాలని వారు కోరారు. సస్పెండైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు టీడీఎల్పీలో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications