బాబుపై తీవ్ర వ్యాఖ్యలు: జగన్‌పై చెప్పులు, రాళ్లు, అరెస్ట్ చేయాలని అనిత
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శనివారం నాడు సాయంత్రం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పుల వర్షం కురిపించారు. ప్రతిగా వైసిపి కార్యకర్తలు కూడా చెప్పులు విసిరారు.
రైతు భరోసా యాత్రలో భాగంగా సాయంత్రం కదిరిలో నిర్వహించిన రోడ్డు షోలోజగన్ మాట్లాడుతూ... రాయలసీమలో మోసం చేసిన వారిని చెప్పులతో కొట్టాలని అంటుంటారని, చంద్రబాబు పైన తాను అలాంటి పెద్ద మాటలు మాట్లాడనని, కానీ నమ్మించి మోసం చేసిన చంద్రబాబును ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
ఈ విషయం తెలిసిన టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వాహనం ఉన్న కూడలి వద్దకు చేరుకున్నారు. అక్కడ జగన్ వాహన శ్రేణి పైకి చెప్పులు విసిరారు. ప్రతిగా వైసిపి వాహన శ్రేణి నుంచి కూడా చెప్పులు పడ్డాయి. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పరిస్థితిని గమించిన పోలీసులు జగన్‌ను ప్రచార రథం నుంచి కిందకు దించి కాన్వాయ్‍లోని వాహనంలో ఎక్కించి భద్రత నడుమ ముందుకు పంపించారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
విశాఖ నక్కపల్లిలో ఎమ్మెల్యే అనిత, ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే కదిరి బాబురావులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలని వారు అందులో కోరారు. చంద్రబాబు పైన జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జగన్ పర్యటన, ఉద్రిక్తం
అనంతపురం జిల్లా కదిరిలో జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆదివారం ఉదయం ఆయన కదిరిలో పర్యటిస్తుండగా.. మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వెంకటప్రసాద్ అనుచరులు, ర్యాలీపై చెప్పుల వర్షం కురిపించారు. జగన్ కాన్వాయ్‌ని వారు అడ్డుకున్నారు.

జగన్ పర్యటన, ఉద్రిక్తం
దీంతో తెలుగుదేశం, వైసిపిల వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తగా, పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

జగన్ పర్యటన, ఉద్రిక్తం
జగన్ యాత్రను జరగనివ్వబోమని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలుగుదేశం కార్యకర్తలు చెబుతుండగా, తమ నేతకు అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైసిపి కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

జగన్ పర్యటన, ఉద్రిక్తం
మరోవైపు, జగన్ సభ నిర్వహణ పైన వివాదం నెలకొంది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు వైసిపి శ్రేణులు ప్రయత్నించారు. ఇందుకు పోలీసులు అంగీకరించలేదు. దీక్షకు నిరాకరించారు. వేరే ప్రాంతంలో దీక్ష నిర్వహించుకోవాలని సూిచంచారు. వైసిపి నేతలు అంగీకరించకుండా అంబేడ్కర్ విగ్రహం వద్దే చేస్తామని పట్టుబడుతున్నారు.

జగన్ పర్యటన, ఉద్రిక్తం
శనివారం నాడు తన పర్యటనలో జగన్ మరోమారు చంద్రబాబుపై వివాదస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్.పీ కుంట మీదుగా నేటి రైతు భరోసా యాత్ర సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.

జగన్ పర్యటన, ఉద్రిక్తం
యాత్రలో భాగంగా ఎన్ పీ కుంటలో ప్రసంగించిన జగన్.. సీఎం చంద్రబాబు తోలు మందం వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తోలు మందం ఎక్కువైనందుకే ఆయన రైతుల సమస్యలను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు.

జగన్ పర్యటన, ఉద్రిక్తం
చంద్రబాబు పాలన హిట్లర్ తరహా నియంత పోకడలతో సాగుతుందని ఆరోపించిన ఆయన, భూకుంభకోణాలు చేస్తున్నవారిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

జగన్ పర్యటన, ఉద్రిక్తం
సాగునీటి వసతి ఉన్నా.. పంటలు పండడమే కష్టమైనపోయిన తరుణంలో, అంతో ఇంతో సాగుకు పనికొచ్చే భూములను సోలార్ పవర్ ప్లాంటుకు ఎందుకు కట్టబెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంతమంది భూములను అన్యాయంగా లాక్కున్నా, కనీసం బాధిత కుటుంబాల్లో ఒక్కరికి కూడా పవర్ ప్లాంట్ లో ఉద్యోగం కల్పించలేదన్నారు.












Click it and Unblock the Notifications