ఘర్షణలు, ఉద్రిక్తత - ఈసీ నిర్ణయం..!!

ఏపీలో భారీ పోలింగ్ నమోదవుతోంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. అయితే, అనూహ్యంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులతో పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేయటంతో ఈసీ సీరియస్ అయింది. అక్కడ పరిస్థితుల పై నివేదిక కోరింది. దీంతో..అక్కడ ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

ఉద్రిక్త పరిస్థితులు
పల్నాడు జిల్లా మాచర్ల,నర్సరావు పేట, ప్రకాశం జిల్లా దర్శి, అనకాపల్లి జిల్లాలో ఎ్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నర్సారావుపేట వైసీపీ అభ్యర్ది గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటి పైన టీడీపీ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు రావటంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. మధ్నాహ్నం తరువాత మాచర్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో పరిస్థితులు ఒక్క సారిగా మారాయి. రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ పోలింగ్ ఏజంట్లపై వైసీపీ నేతలు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Tensions flared up in Palnadu district as clashes erupted between TDP and YSRCP

పరస్పర దాడులు
నెల్లూరు జిల్లా దగదర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం దాడికి దిగాయి ఇరు వర్గాలు. కడప జిల్లా జమ్మలమడుగులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, కూటమి కార్యకర్తలు ఎదురుపడటంతో మాటా, మాటా పెరిగి ఇరువర్గాలు దాడికి యత్నించాయి. రెండువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్‌ నెలకుంది. కమాన్‌ సర్కిల్‌లో వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. పరస్పరం రాళ్ల దాడితో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. జిల్లా ఎస్పీ వాహనం కూడా రాళ్ల దాడిలో ధ్వంసమయ్యింది.

ఈసీ సీరియస్
అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహించారు టీడీపీ నేతలు. ఇది పద్దతి కాదని అడ్డుకున్నారు వైసీపీ నేతలు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలో ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. తారక రామానగర్ యుపి స్కూల్ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైసీపీ ఏజెంట్లు ఘర్షణ పడ్డారు. ఈ గొడవతో ఓటర్లు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కాసేపు పోలింగ్ నిలిపివేశారు అధికారులు.
పల్నాడు జిల్లా పెదకూరపాడులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. అచ్చంపేట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+