నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత: వైసిపి నేత రాజగోపాల్‌పై టిడిపి దాడి! గాయాలు
నంద్యాల ఉప ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. నంద్యాలలోని గాంధీ నగర్ పోలింగ్ బూత్ వద్ద టిడిపి - వైసిపి నేతల పరస్పర దాడిలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు స్వల్పంగా గాయాలయ్యాయి.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. నంద్యాలలోని గాంధీ నగర్ పోలింగ్ బూత్ వద్ద టిడిపి - వైసిపి నేతల పరస్పర దాడిలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు స్వల్పంగా గాయాలయ్యాయి.

టిడిపి నేతలు డబ్బులు పంచుతున్నారంటూ..
ఒంగోలు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాంబాబు అనుచరులు గాంధీ నగర్ పోలింగ్ సెంటర్ వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని సమాచారం వచ్చింది. ఇది తెలిసి వైసిపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Recommended Video


టిడిపి వర్సెస్ వైసిపి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాజగోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు అక్కడకు వచ్చారు. టిడిపి నేతలు డబ్బు పంచుతుండటాన్ని ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

పరస్పరం దాడి
అనంతరం ఇరువర్గాల మధ్య తోపులాట, పరస్పరం దాడి జరిగింది. టిడిపి నాయకులు డబ్బులు పంచుతున్నారని, అందుకే తాము అడ్డుకుంటున్నామని వైసిపి నేత రాజగోపాల్, ఆయన అనుచరులు అన్నారు. ఈ దాడిలో వైసిపి నేతలకు గాయాలయ్యాయి. రాజగోపాల్ రెడ్డి పైనా దాడికి ప్రయత్నించారు.

కొన్నిచోట్ల మందకోడిగా..
నంద్యాల నియోజకవర్గంలో భారీగా పోలింగ్ జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ మందకోడిగా ఉంది. దీంతో ఇరు పార్టీల నేతలు ఓటర్లను దగ్గరుండి మరీ తీసుకు వచ్చి ఓటు వేయిస్తున్నారు. ఇందులో భాగంగా టిడిపి నేతలు డబ్బులు పంచుతున్నారని వైసిపి నేతలు ఆరోపించడంతో వాగ్వాదం, తోపులాట, దాడి చోటు చేసుకుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications