'25 ఏళ్లుగా బాబుతో ఉన్నా ఆ గొంతు ఆయనదే, ముఖంలోను..'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో తాను 25 ఏళ్లు ఉన్నానని, ఆయన గొంతు తనకు తెలుసునని, ఆడియో టేప్‌లో ఉన్న గొంతు ఆయనదేనని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం అన్నారు.
చంద్రబాబు హావభావాల్లో తప్పు చేశారనే భావ కనిపిస్తోందని చెప్పారు. తాను అంటించుకున్న అవినీతి బురదను చంద్రబాబు ఇతరులకు పూయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును ప్రధాన దోషిగా చేర్చాలని తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కేసులో తప్పును ఒప్పుకోకుండా తెరాస ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా తెరాస విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ... నిప్పులాంటి మనిషిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ కేసులో చిత్తశుద్ధి ఉంటే నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని బాబు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications