జైలుకు వెళ్లిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోతారా, దగ్గరల్లో రివైంజ్?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత వైసీపీపి ప్రభుత్వం లోనే అవినీతిని బయటకు లాగాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని, ఆయన ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపిస్తూ అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే జైలు ముఖం చూడాల్సి వచ్చింది. తనను జైలుకు పంపించిన వైసీపీ నాయకుల భరతం పట్టాలని ఆరోజే చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో 700 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీల్లో నివాసం ఉంటున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సాధారణ సంఘాలు ప్రతి ఏడాది నిధులు విడుదల చేస్తుంటాయి. ఈ నిధులు ఎంత ఖర్చు అయ్యాయి అని ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. అయితే గత వైసీపీ సిపి ప్రభుత్వంలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని, గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంపై చిత్తూరు జిల్లాలో ఆడిట్ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ఆడిట్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. అయితే కొందరు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు చేసిన అధికారులు ఇప్పుడు ప్రభుత్వ విచారణ నుండి తప్పించుకోవడానికి ఆడిట్ చేస్తున్న అధికారులకు భారీ మొత్తంలో లంచాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి.

మీరు అడిగినంత డబ్బు ఇస్తామని, మా పైన శాఖా పరమైన విచారణ జరగకుండా మమ్మల్ని బయటపడేయాలని కొందరు అధికారులు అడిట్ శాఖ అధికారలతో డీల్ మాట్లాడుతున్నారని వెలుగు చూసింది. జడ్పీ, మండల పరిషత్, నగరపాలక, పురపాలక సంస్థల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆడిట్ చేస్తున్న ఉద్యోగుల మందు ఇలాంటి డిమాండ్లు పెడుతున్నారని తెలిసింది. ఎం బుక్కులు లేకుండానే అనేక పనులు చేశారని, వాటికి ఓచర్లు కూడా లేకుండా డబ్బులు చెల్లించారని ఆడిట్ లో వెలుగు చూసింది.
ఇలా భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారని ఆడిట్ లో ఒక్కసారిగా బయపడుతున్నాయని సమాచారం. ఇలా చిక్కిపోయిన కొందరు ఉద్యోగులు ఇప్పుడు మమ్మల్ని మీరే కాపాడాలని ఆడిట్ శాఖ అధికారులను వేడుకుంటున్నారని తెలిసింది. ఆడిట్ శాఖకు చెందిన అధికారుల ముందు భారీ మొత్తంలో లంచాలు ఇస్తామని ఆ అవినీతి అధికారులు డిమాండ్లు పెట్టారని తెలిసింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.

అయితే అవినీతి అధికారులకు ఆడిట్ శాఖ అధికారులు కొమ్ము కాస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆడిట్ శాఖ ఆర్ డిడి గోవిందప్ప అంటున్నారు. ముఖ్యంగా జడ్పీ, మండల పరిషత్, పురపాలక, నగరపాలక శాఖల్లో భారీ మొత్తంలో గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు రావడంతో ఆ విషయంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలి తెలిసింది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగోతం మరోసారి తెరమీదకు వచ్చింది.












Click it and Unblock the Notifications