అక్టోబర్ 15లోగా రుణమాఫీ చేస్తాం: పత్తిపాటి

50వేల లోపు రుణం తీసుకున్న రైతులు 40శాతం మంది ఉన్నారని, తుది జాబితా రాగానే అక్టోబర్ 15లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆధార్ కార్డుల అనుసంధానంలో సమస్యులుంటే అలాంటివారు మిగిలిన గుర్తింపు కార్డులు చూపిస్తే అర్హుల జాబితాలో చేరుస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు.
కర్నూలులో పర్యటించిన సందర్భంగా రైతు రుణాల మాఫీ అంశంపై కలిసిన పలువురు రైతుల నాయకుల సందేహాలను మంత్రి పుల్లారావును నివృత్తి చేశారు. అనంతరం స్టేట్ గెస్ట్ హౌజ్ నుంచి మంత్రి స్థానిక రైతుబాజర్‌కు చేరుకుని రైతులతో మాట్లాడారు.
కర్నూలు జిల్లాకు 12.5 వేల టన్నుల యూరియాను సరఫరా చేస్తామని, నకిలీ విత్తనాలు, పురుగుమందుల అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications