లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. లోక్ సభ తో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మిత్రపక్షాల నేతలకు సమాచారం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సిద్దమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ స్థానాలకు భారీగా పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.
కేంద్రం సంచలన నిర్ణయం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. లోక్ సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నియోజకవర్గాలు 263కు తెలంగాణలో 179కి చేరతాయి. 2029 ఎన్నికల నుంచే నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుత 119అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగస్వామ్య పక్షాల నేతలకు వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణలో పెరిగే సీట్ల లెక్క ఇలా
కాగా, ఇదే అంశం పైన కాంగ్రెసేతర విపక్షాలతోను విడిగా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌తోనూ అమిత్ షా మాట్లాడే అవకాశం ఉంది. అయితే.. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురానున్నారు. లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి 2029 ఎన్నికల్లో అమలు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో ఎంపీ, అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే 50 శాతం మేర పెరగనున్నాయి. మహిళలకు ఏపీలో లోక్ సభ 13, అసెంబ్లీ స్థానాలు 87 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. అదే విధంగా తెలంగాణలో మహిళలకు 9 లోక్ సభ, 60 అసెంబ్లీ స్థానాలకు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్ మేరకు సీట్లను ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications