పరారీలో తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడు, ఆయన భార్య
చిట్టి గడువు ముగిసి మూడు సంవత్సరాలవుతున్నా నితిన్ కు రావాల్సిన డబ్బుల్ని దంపతులు ఇవ్వలేదు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడితో పాటూ అతని భార్యపై కేసు నమోదైంది. తిరుచానూరు ఎస్వీపీ కాలనీకి చెందిన నితిన్ సింగ్ స్థానికంగా కిరాణా షాపు నడుపుతూ జీవనం సాగించేవాడు. అతడు తన సొంత అవసరాల కోసం ఇంటి సమీపంలో ఉంటున్న పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు ప్రతాప్ స్వామి భార్య వాణి దగ్గర భారీ మొత్తంలో చిట్టీలు వేశాడు. నమ్మకంగా ఉంటారని భావించి వారికి డబ్బులు కట్టాడు.
చిట్టి గడువు ముగిసి మూడు సంవత్సరాలవుతున్నా తనకు రావాల్సిన డబ్బుల్ని దంపతులు ఇవ్వలేదు. అడిగి అడిగి విసిగిపోయిన నితిన్ మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయేముందు తన చావుకు కారణం చిట్టీ నిర్వహిస్తున్న దంపతులే కారణమని లేఖలో పేర్కొన్నాడు. నితిన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. ప్రతాప్ స్వామి, వాణిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయల చిట్టీలు తిరిగి చెల్లించకుండా పారిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడితో పాటూ భార్యపై కేసు నమోదు కావడం తిరుచానూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి నిత్యం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ జరుగుతాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసేస్తారు. ప్రతి సోమవారం "అష్టదళ పదపద్మారాధన" జరుగుతుంది. శుక్రవారం నాడు అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ చేస్తారు. శ్రావణమాసంలోను, మరి కొన్ని దినాల్లో లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా భావించి స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవాలు కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుంచి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం.












Click it and Unblock the Notifications