శిరోముండనం కేసు ... నూతన్ నాయుడు భార్యతోసహా ఏడుగురిపై కేసు..అందులో నలుగురు మహిళలు

బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించడం ఏపీలో మరో కొత్త వివాదానికి కారణమైంది. ఇటీవల కాలంలో ఈ ఏపీలో దళితులపై దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయి. ఇక తాజాగా నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దారుణం వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదు చేశారు. చర్యలకు ఉపక్రమించారు

. నూతన్ నాయుడు భార్యపై , ఆమెకు సహాయం చేసిన వారిపై కేసు నమోదు చేశారు . పెందుర్తి లోని సుజాతనగర్ లో బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన నూతన్ నాయుడు ఇంట్లో దారుణం జరిగింది . నూతన్ నాయుడు వద్ద గిరిప్రసాద్ నగర్ కు చెందిన కర్రి శ్రీకాంత్ పని చేసేవాడు. కొంతకాలం పాటు పనిచేసి పని మానేసిన అతని ఇంటికి పిలిచి మరి శిరోముండనం చేయించారు. నూతన్ నాయుడు భార్య శ్రీకాంత్ కి ఫోన్ చేసి నువ్వు సెల్ ఫోన్ తీశావు . ఇంటికి రా అంటూ పిలిచింది . దీంతో ఇంటికి వెళ్లిన యువకుడికి స్థానిక బార్ ని పిలిపించి గుండు గీయించారు. తప్పు చేశాడంటూ శిరోముండనం చేయించిన వారి తీరుతో మనస్తాపానికి గురైన యువకుడు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

 The head tonsured case... scst atrocity cases filed on Nutan Naidus wife and six others

విచారణ చేపట్టిన పోలీసులు యువకుడికి శిరోముండనం చేస్తున్న సిసి ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం. నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే సిబ్బంది పై వివిధ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేశారు. కేసు నమోదు అయిన వారిలో ఇందిరా, మధుప్రియ, సౌజన్య, ఝాన్సీ, వరహాలు, బాలు, రవి లు ఉన్నారు. వీరందరిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోపక్క ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఏపీలో ఒక దళిత యువకుడి శిరోముండనం కేసు దేశవ్యాప్త చర్చకు కారణం కాగా, తాజాగా మరో దళిత యువకుడి శిరోముండనం చేయించడం ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. అందుకే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది . దీంతో నూతన్ నాయుడు భార్య మధు ప్రియ తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 307, 342, 324,323,506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి.

Recommended Video

    Movie Shootings To Resume, సినీ కార్మికులకు శుభ వార్త | పాటించాల్సిన రూల్స్ ఇవే!! || Oneindia

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+