వైసీపీలోని ఈ నాయకులు చేసిన పనికి ఆ పార్టీ చీఫ్ జగన్ అడ్రస్ గల్లంతు అయ్యింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ నాయకుల తలరాతలు తారుమారు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేశారు ఇక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తప్పా జగన్ క్యాబినెట్ మంత్రులు ఎవ్వరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు. మామీద ప్రజలకు ఇంత వ్యతిరేకత ఉందా ? అని ఊహించలేదని స్వయంగా వైఎస్ జగన్ మీడియా ముందు చెప్పారు.
అయితే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు వైసీపీ హైకమాండ్ ఇప్పుడు ఆలోచనలో పడింది. ఐదు సంవత్సరాలు సీఎంగా పని చేసిన వైఎస్ జగన్ కు ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి జరిగిందో తెలీదా ? అని వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తున్న వైసీపీ నాయకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి మీద చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు జగన్ మరోసారి సీఎం అయ్యేవారని వైసీపీకి చెందిన సామాన్య కార్యకర్తలు అంటున్నారు.

పులివెందల పులి సీఎం కుర్చీలో ఉందని, మాకు ఎవరు అడ్డువస్తారని వైసీపీకి చెందిన కొందరు నాయకులు రెచ్చిపోవడంతో ఇప్పుడు అదే వైసీపీని ప్రజలు గంగలో కలిపేశారని సామాన్య ప్రజలు అంటున్నారు. అరాచకాలకు, దౌర్జన్యాలకు ఓ హద్దు ఉంటుందని, మనిషి ఓపికకు, సహనానికి ఓ హద్దు ఉంటుందని, అయితే వైసీపీ నాయకులు అడ్డుఅదుపులేకుండా రెచ్చిపోవడంతో ప్రజలు తిరగబడే పరిస్థితి ఎదురైయ్యిందని, ఎదురుతిరగలేని జనం చివరికి ఓటు అనే ఆయుధంతో వైసీపీ నాయకుల తలరాతలు మార్చేశారని సామాన్య ప్రజలు అంటున్నారు.

అంబటి రాంబాబు, ఆర్ కే రోజా, అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇలా చాలా మంది వైసీపీ నాయకులు బహిరంగంగా ప్రతిపక్ష నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులను నోటికి వచ్చినట్లు మాట్లాడటం, వారి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ కొంప మునిగిపోవడానికి కారణం అయ్యిందని, ఆ వీడియోలు చూసినా జగన్ పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి నాయకులను జగన్ కంట్రోల్ లో పెట్టలేదని వైసీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అంతా జరిగిపోవంతో ఇక ఐదు సంవత్సరాలు సొంత పనులు చూసుకోవడం తప్పా వైసీపీ నాయకులు చేసేది ఏమీలేదని తెలుగు ప్రజలు అంటున్నారు. వైసీపీ నాయకులను పలకరించాలని మీడియా చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. వైసీపీ లీడర్స్ మాత్రం సైలెంట్ అయిపోయారు.












Click it and Unblock the Notifications