ఈ జిల్లాల్లో మరి కొంతసేపట్లో పిడుగులు పడే అవకాశం...ఈ నెల 22 లేదా 23న అల్పపీడినం
అమరావతి:ఇటీవలి కాలంలో వాతావరణంలోని మార్పులను ఖచ్చితత్వానికి దగ్గరగా అంచనా వేయగలుగుతున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా మరో కీలకమైన హెచ్చరిక చేసింది.
వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా మరికొద్ది సేపట్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడే అశకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమప్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. విశాఖలోని చోడవరం, బుచ్చయ్యపేట, కశింకోట, రావికమతం, మాకవరపాలెం, యలమంచిలి, మునగపాకలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల, వై.రామవరం, గంగవరం, రంపచోడవరం మండలాలకు పిడుగు హెచ్చరికలు జారీచేశారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆరుబయట నుంచి వీలైనంత త్వరగా సురక్షిత భవనాలకు తరలివెళ్లి తలదాచుకోవాలని వారు సూచించారు.
ఇదిలా ఉండగా ఒడిసా నుంచి కోస్తా మీదుగా తమిళనాడువరకు ద్రోణి కొనసాగుతున్న క్రమంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ నెల 22 లేదా 23న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నదని ఆర్టీజీఎస్, ఇస్రో నిపుణుడు ముందస్తు హెచ్చరిక చేశారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications