మెగా డీఎస్సీ ఫైల్ సిద్దం ?, చంద్రబాబు సంతకంపై ఆశలు, ఎన్ని వేల ఉద్యోగాలు అంటే ?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారని, ఇప్పుడు మెగా డీఎస్సీ పై సంతకం చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
తిరుమల నుంచి గురువారం విజయవాడ వెలుతున్న సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం ఏ ఫైలు మీద చేస్తారు ? అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని, నేను సీఎం అయిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం కూడా అయిపోయారు.

అయితే విజయవాడలో చంద్రబాబు ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీని ప్రకటిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని నిరుద్యోగులు అంటున్నారు. తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు ఎప్పుడెప్పుడు విజయవాడ చేరుకుంటారా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో సుమారు 13 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో చిత్తూరు జిల్లాలోని 3,520 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. బీఇడీ చదివిన యువకులు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో స్విగ్గీ బాయ్స్, ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. చంద్రబాబు మెగా డీఎస్సీని ప్రకటించిన వెంటనే పోటీ పరీక్షలు రాయడానికి సిద్దం కావాలని నిరుద్యోగ యువతి, యువకులు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications