తప్పు తెలుసుకున్నాము, ఒక్క చాన్స్ ఇస్తే సరిదిద్దుకుంటాము, చంద్రబాబుకు ఆ ఉద్యోగుల మనవి
ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా వైసీపీ నాయకులు చెప్పినట్లు చేసి అప్పటి జగన్ ప్రభుత్వం కోసం పని చేసిన వాలంటీర్ల జీవితాలు నేడు రోడ్డున పడ్డాయి. మన ప్రభుత్వమే వస్తుందని, మీకు మేము ఉన్నామని వైసీపీ నాయకులు చెప్పిన మాయమాటలు నమ్మి ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు మాకు మరో అవకాశం ఇస్తే చేసిన తప్పులు దిద్దుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2019లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది. వాలంటీర్లను అడ్డం పెట్టుకున్న వైసీపీకి చెందిన కొందరు నాయకులు టీడీపీ సానుభూతిపరులపై కక్షసాధింపులకు దిగారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజాసేవ కోసం నియమితులైన వాలంటీర్లను వైసీపీ నాయకులు వాళ్ల పార్టీల అవసరాల కోసం ఉపయోగించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపణలు చేసినా వైసీపీ నాయకులు కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత వాలంటీర్లను పూర్తిగా వైసీపీ కోసం ఉపయోగించుకున్నారు. ఈసీ హెచ్చరికలతో వాలంటీర్లతో రాజీనామాలు చేయించి పూర్తిగా వైసీపీ కోసం పని చెయ్యాలని ఆ పార్టీ నేతలు వాలంటీర్ల మీద ఒత్తిడి తెచ్చారు.

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాలను (జీతాలు) రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు పెంచుతామని చంద్రబాబు చెప్పిన మాటలను వాలంటీర్లు నమ్మలేదు. మనం మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాల ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని, మీకు అండగా నేను ఉంటానని వైఎస్ జగన్ చెప్పిన మాటలను వాలంటీర్లు నమ్మారు. వైసీపీ ప్రలోభాలకు లొంగిపోయిన వేలాది మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.
కొన్ని జిల్లాల్లో రాజీనామాలు చెయ్యడానికి నిరాకరించిన వాలంటీర్లను వైసీపీ నాయకులు బెదిరించి వారితో బలవంతంగా రాజీనామాలు చేయించాని ఆరోపణలు ఉన్నాయి. అయితే వాలంటీర్లు ఊహించినట్లు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్లు హడలిపోయారు. వైసీపీ నాయకులను గుడ్డిగా నమ్మి రాజీనామాలు చేసిన వాలంటీర్లు రోడ్డునపడ్డారు.

అయితే వైసీపీ నాయకుల బెదిరింపులకు లొంగకుండా రాజీనామాలు చెయ్యడానికి నిరాకరించిన వాలంటీర్లు మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారు. వాలంటీర్ల ప్రక్రియపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు. చేసిన తప్పు దిద్దుకునేందుకు మరో అవకాశం దక్కుతుందా ? అని వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వైసీపీ కోసం పని చేసిన వాలంటీర్లను తీసుకుని మనం కూడా మరో తప్పు చెయ్యకూడదని టీడీపీ నాయకులు చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద వాలంటీర్లగా పని చేసి వైసీపీ ముద్రవేసుకున్న వాలంటీర్ల పరిస్థితి దారుణంగా తయారైయ్యింది.
-
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications