శ్రీవారి ఆలయం హుండీ నుంచి రూ.13వేలు చోరీ, బెంగళూరువాసి
చిత్తూరు: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ప్రధాన హుండీలో నుంచి బెంగళూరుకు చెందిన యువకుడు చోరీ చేశాడు. ఇంటెలిజెన్స్ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
అందరి కళ్లు గప్పి రూ.13వేల నగదును శ్రీవారి ప్రధాన హుండీ నుంచి దొంగిలించాడు. అది సీసీ టీవీలో రికార్డ్ అయింది. అతనిని అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ డబ్బును స్వాధీనం చేసుకుంది. హుండీ నిండటం వల్ల డబ్బులు తీసుకోవడం సాధ్యమైనట్లు గుర్తించారు. అతనిని పోలీసులకు అప్పగించారు.
శ్రీవారిని దర్శించుకున్న మృణాళిని

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపం వద్ద మంత్రికి టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
విశాఖలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
విశాఖ జిల్లాలోని గొలుగొండ మండలం అప్పన్నపాలెంలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది.
పొలానికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేసరికి దివ్యశ్రీ ఒంటి పైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యం కారణంగా మూడు రోజులుగా దివ్యశ్రీ కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
విశాఖలో గోకుల్ పార్కు దగ్గర సముద్రతీరంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభించింది. పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. సముద్ర తీరంలో యువతి ఎలా మరణించిందనే విషయమై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications