Chandrababu: హైటెక్ సిటీ ప్రకటించకముందే 12 ఎకరాలు కొన్న చంద్రబాబు..!
ఏదైనా ఏరియాలో భూముల ధరలు అమాంతం పెరిగాయంటే దానికి కారణం ఏంటి..? ఆ ఏరియాలో ఏమైనా కంపెనీలు వస్తేనో.. లేక ఏమైనా ప్రభుత్వం కాలేజీలు వస్తేనో లేదా ప్రభుత్వంకు సంబంధించి ఇతర ప్రాజెక్టులు వస్తేనో ధరలు పెరుగుతాయి.
అయితే అక్కడికి కంపెనీలు, కాలేజీలు, ఇతర ప్రాజెక్టులు వస్తాయని ఎవరికి ముందుగా తెలుస్తుందనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. ఫలానా ప్రాంతంలో ఫలానా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయన్న సమాచారం ముందుగా ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు, అధికార పార్టీ నేతలు సమాచారం ఉంటుంది.

ముందే సమాచారం ఉండడంతో వారు ఆ ఏరియాలో భూములు కొనే అవకాశాలున్నాయి. కొన్న భూముల ధర పెరగ్గానే అమ్ముకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు.చంద్రబాబు మానసపుత్రికగా చెప్పుకునే హైటెక్ సిటీని ప్రకటించక ముందు ఆ ఏరియాలో 12 ఎకరాలు కొనుగోలు చేశారని ఆకునూరి మురళి స్పష్టం చేశారు.
అయితే హైటెక్ సిటీ చుట్టు పక్కల చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి భూములు ఎక్కువగా ఉన్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూడా అమరావతిని రాజధానిగా ప్రకటించడానికంటే ముందు.. అక్కడ అధికార పార్టీకి చెందిన నేతలు భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడారు కూడా. ఇది అధికార దుర్వినియోగం కిందికే వస్తుందని చెబుతున్నారు. ముందే భూములు కొనడం సరైంది కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications