వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబును ఎలా ఆపగలం? భయపడేది లేదు: ప్రతీపైసాకూ లెక్కంటూ తేల్చేసిన అమిత్ షా

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీ వెళ్లిపోయినా ఎన్డీఏ ఏ మాత్రం బలహీనపడలేదు, 2019 లో కూడా మేమే !

న్యూఢిల్లీ: ఓ వైపు తమ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ఆగ్రహం చేస్తూనే.. పార్లమెంటు అవిశ్వాస తీర్మానం పెడుతుండగా.. మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ఏపీకి చాలా చేశామని అంటున్నారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

విభజన వల్ల నష్టపోయిన ఏపీకి తగిన న్యాయం చేసేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసిందని చెప్పారు. ఏపీకి గత నాలుగేళ్లలో ఇచ్చినన్ని నిధులను సమైక్యాంధ్రప్రదేశ్‌కు కూడా ఏ కేంద్ర ప్రభుత్వమూ ఇవ్వలేదని అన్నారు. అంతేగాక, ఏపీకి ఇచ్చిన ప్రతీ పైసాకు లెక్క చెప్తామని అమిత్ షా స్పష్టం చేశారు.

బాబును వెళ్లగొట్టలేదు

బాబును వెళ్లగొట్టలేదు

ఎన్డీఏ నుంచి చంద్రబాబును తాము వెళ్లగొట్టలేదని, ఆయనే బయటకు వెళ్లిపోయారని అమిత్ షా వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలు ఎవరినీ తాము బయటకు పంపాలని అనుకోలేదని, చంద్రబాబు వెళ్లాలనుకున్నప్పుడు ఎలా ఆపగలమని చెప్పారు.

బీజేపీ టార్గెట్ 2019: ఏపీ ‘కాపు' పైనే ఫోకస్, రంగంలోకి రామ్‌మాధవ్, పవన్ ప్రభావం?బీజేపీ టార్గెట్ 2019: ఏపీ ‘కాపు' పైనే ఫోకస్, రంగంలోకి రామ్‌మాధవ్, పవన్ ప్రభావం?

టీడీపీ వెళ్లిపోయినా..

టీడీపీ వెళ్లిపోయినా..

అంతేగాక, టీడీపీ వెళ్లిపోయినా.. తమ కూటమిలో ఇంకా 30పార్టీలున్నాయని, ఎన్డీఏ ఏ మాత్రం బలహీనపడలేదని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోకసభ ఎన్నికల్లోనూ 300కి పైగా స్థానాలతో మళ్లీ అధికారంలోకి వస్తామని అమిత్ షా చెప్పారు. చంద్రబాబు వెళ్లడం వల్ల బీజేపీ దక్షిణాది కలలకు ఆటంకం కలిగిందా? అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ.. అక్కడ ఇంకా బలపడవచ్చేమో అన్నారు.

రెచ్చిపోవడం మంచిది కాదు.. ఏపీలో పుంజుకుంటాం

రెచ్చిపోవడం మంచిది కాదు.. ఏపీలో పుంజుకుంటాం

‘మిత్రపక్షాలు రెచ్చిపోవటం మంచిది కాదన్నది మా భావన. కానీ, వారే వెళ్లిపోతే మేం ఏమి చేయగలం. మాకు ఏపీలో ఇప్పుడు రెండు సీట్లే ఉన్నాయి. భవిష్యత్తులో పెరగవచ్చేమో. కాంగ్రెస్‌ మాదిరిగా.. అవసరాలకు తగ్గట్లు మేము వ్యవహారాలు నడపలేదు. మాకు కేంద్రంలోనూ, యూపీలోనూ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మిత్రపక్షాలను ప్రభుత్వాలలో చేర్చుకుని వారికి గౌరవాన్ని ఇచ్చాం' అని అమిత్ షా తెలిపారు.

‘బాబూ డ్రామాలు ఆపు- అవినీతిపై పీఎంకి ఫిర్యాదు! ఏపీకి టీడీపీ, బీజేపీలతో తీరని అన్యాయం'‘బాబూ డ్రామాలు ఆపు- అవినీతిపై పీఎంకి ఫిర్యాదు! ఏపీకి టీడీపీ, బీజేపీలతో తీరని అన్యాయం'

భయపడేది లేదు

భయపడేది లేదు

‘అవిశ్వాసానికి మేం భయపడటంలేదు. ఎన్డీయేకు 300 మంది బలం ఉంది. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. బీజేపీ ఎంపీలు ఎవరూ సభామధ్యంలోకి వెళ్లి సభను అడ్డుకోవటం లేదు. తొలి వారం కాంగ్రెస్‌, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు సభామధ్యంలోకి వెళ్లి ఆందోళన చేస్తున్నారు' అని అమిత్ చెప్పారు.

దేవాన్ష్ బర్త్‌డే: తిరుమలలో ఫ్యామిలీతో బాబు, బాలకృష్ణ హ్యాపీగా, విరాళం(పిక్చర్స్)దేవాన్ష్ బర్త్‌డే: తిరుమలలో ఫ్యామిలీతో బాబు, బాలకృష్ణ హ్యాపీగా, విరాళం(పిక్చర్స్)

ఆందోళనలు ఎందుకు?

ఆందోళనలు ఎందుకు?

‘నియమానుసారం చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుటికే విషయాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌, రవిశంకర్‌ప్రసాద్‌, అనంత్‌కుమార్‌లు ఉభయ సభల్లో ప్రకటించారు. చర్చ జరగాలని, ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే మా ఉద్దేశం. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటానికి ముందే జైట్లీ, రాజ్‌నాథ్‌లు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు మాట్లాడిన ప్రతి అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. కానీ, విపక్షాలే సభను అడ్డుకుంటున్నాయి' అని అమిత్‌ షా అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామని మరోసారి షా ధీమా వ్యక్తం చేశారు.

English summary
Despite the N Chandrababu Naidu-led Telugu Desam Party (TDP) walking out of the National Democratic Alliance (NDA) government and some other allies also sounding disgruntled, Bharatiya Janata Party chief Amit Shah has expressed confidence that the NDA will return to power in 2019 General Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X