పవన్‌కళ్యాణ్ భవిష్యత్‌లో జగన్‌పై చేసే సంచలన ఆరోపణలివే: షాకింగ్ లిస్టు పెట్టిన ఆర్జీవీ!!
తాజాగా పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ప్రజలకు సేవలు చేస్తున్న వాలంటీర్ల పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.
ప్రజల కోసం పనిచేసే వైసీపీ వాలంటీర్ల ని పవన్ కళ్యాణ్ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచాతి నీచంగా అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వాలంటీర్లకు సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే వాళ్లు పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని, పెట్టకపోతే వాళ్ళింట్లో ఫ్యామిలీలకు మొహాలు ఎలా చూపెట్టగలరు అంటూ రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.

వైసిపి ప్రభుత్వం మహిళల ట్రాకింగ్ చేస్తోంది అనే పవన్ కళ్యాణ్ ఆరోపణ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు ఎవరి మీద చేసిన ఆరోపణలు అన్నింటికీ పరాకాష్ట అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ల దగ్గర ఈ విషయం మీద ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ చెవిలో ఎందుకు చెప్పారు అంటూ ప్రశ్నించారు.
అంతేకాదు వాక్ స్వాతంత్రం ఉన్నది అభిప్రాయాలు చెప్పడానికి, భిన్నాభిప్రాయాలు తో డిబేట్ లు ప్రొవోక్ చేయడానికి, కానీ జీరో ఎవిడెన్స్ లేని ఆరోపణలు చేయడానికి కాదు అంటూ పేర్కొన్నారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ కి ఇది తెలియక పోవడం అతని చదువు లేని తనాన్ని నిరూపిస్తోంది అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

అంతేకాదు నా ఊహల ముందు ముందు వైఎస్ జగన్ పైన పవన్ కళ్యాణ్ చేయబోయే ఆరోపణల లిస్టు ఇదేనంటూ పేర్కొన్న రాంగోపాల్ వర్మ 9/11 అటాక్ కి అల్ ఖైదాకి ఫండింగ్ చేసింది జగనే అని సిఐఏ వాళ్ళు నా ఎడమ చెవిలో చెప్పారని చెబుతారన్నారు. సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖస్సోగి హత్యలో జగన్ హస్తం లేదు కానీ ఖచ్చితంగా తన కాలుందని మా ఎదురింటి సుబ్బారావు చెప్పాడని చెబుతారన్నారు.
దేశంలో జరుగుతున్న అన్ని క్రైమ్స్ లో జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నాకు గాడ్ ఫాదర్ మార్లోన్ బ్రాండో చెప్పాడని పవన్ కళ్యాణ్ చెబుతాడని సెటైర్లు వేశారు. ప్రపంచం లో జరిగే స్కాం లన్నింటికీ మూల కారణం జగన్ అని నాకు చేగువేరా దెయ్యం చెప్పిందని చెబుతాడని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications