వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులతో సీట్లు కోల్పోయిన సిట్టింగ్ లు వీరే..!
ఏపీలో అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు కలకలం రేపుతోంది. నిన్న మొన్నటివరకూ సీఎం జగన్ చెప్పినట్లు విని గడప గడపకూ పరుగులు తీసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎన్నికల వేళ చివరి నిమిషంలో తమకు సీట్లు లేవని చెప్పేస్తుండటంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్దితిలోకి వెళ్లిపోతున్నారు. వీరిలో కొందరు పార్టీ మార్పులకు సిద్ధపడుతుండగా.. మరికొందరు వైసీపీలో ఉంటూ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు.
వైసీపీలో తాజాగా రెండు దఫాలుగా జరిగిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో మొత్తం 38 సీట్లలో మార్పులు చేర్పులు జరిగాయి. వీటిలో 35 ఎమ్మెల్యే స్ధానాలతో పాటు మూడు ఎంపీ స్ధానాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ మొండి చేయి చూపారు. వీరితో పాటు ఓ ఎంపీకి కూడా సీటు కేటాయించకుండా పక్కనబెట్టేశారు. దీంతో వీరంతా భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు. పలుదఫాలుగా చర్చల తర్వాత వెలువడుతున్న ఈ జాబితాల్లో ఇంకెన్ని పేర్లు ఉన్నాయో తెలియక మిగిలిన వారిలోనూ ఆందోళన పెరుగుతోంది.

వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల సందర్భంగా సీట్లు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేల్లో తొలి విడతలో ముగ్గురికి సీటు దక్కలేదు. రెండో విడతలో ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. దీంతో రెండు విడతల్లో కలిపి మొత్తం 13 మంది సీట్లు కోల్పోయారు. మొదటి లిస్ట్‌లో సీటు రాని ఎమ్మెల్యేల్లో సుధాకర్ బాబు(సంతనూతలపాడు), మద్దాలి గిరిధర్ (గుంటూరు వెస్ట్), ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి) ఉన్నారు.
అలాగే రెండో జాబితాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. వీరితో పాటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications