ఇప్పుడు కాదు: ఫిక్సింగ్‌పై విజయమ్మ, రోజా నిప్పులు
రాజమండ్రి/హైదరాబాద్: ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అందరికీ తెలుసునని అయితే, ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం అన్నారు. ఆమె తూర్పు గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రంపై తక్షణ సాయం కోసం ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినా బాధితులను ఆదుకోవడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. రైతులకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తడిసి, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం, డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం బియ్యం, కిరోసిన్ ఇవ్వడే లేదని, చేనేత కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆరోపించారు.
రూ.3.5వేల కోట్ల నష్టం: రఘువీరా
భారీ వర్షాల కారణంగా రూ.3.5 కోట్ల నష్టం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షలు ఇస్తామన్నారు. వర్షాల కారణంగా 48,500 ఇళ్లు దెబ్బతిన్నాయని, 53 మంది మృతి చెందారని చెప్పారు.
కక్ష సాధింపు: రోజా
మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కక్ష సాధింపుగా విమర్శలు చేయడం సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు రోజా వేరుగా అన్నారు. జెసి మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యల పైన రోజా మండిపడ్డారు. అలాంటి విమర్శలు కాంగ్రెసు నేతలు మానుకోవాలన్నారు. విభజనపై మొండిగా వెళ్లడం సరికాదన్నారు. సీమాంధ్రలో ఇంత ఉద్యమం జరుగుతున్నా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు దురదృష్టకరమన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications