శోభా ఘాట్ పక్క.. భూమా చితికి జగత్ నిప్పు: అఖిలని చూసి ఎవరికీ కన్నీరు ఆగలేదు
భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు శోభా ఘాట్ పక్కనే నిర్వహించారు. కొడుకు జగత్ విఖ్యాత రెడ్డి భూమా చితికి నిప్పు అంటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మూడుసార్లు గాల్లోకి తుపాకితో కాల్పుల
ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు శోభా ఘాట్ పక్కనే నిర్వహించారు. కొడుకు జగత్ విఖ్యాత రెడ్డి భూమా చితికి నిప్పు అంటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మూడుసార్లు గాల్లోకి తుపాకితో కాల్పులు జరిపారు.
అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వేలాది మంది తరలి వచ్చారు. తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆళ్లగడ్డ కన్నీటి సంద్రమైంది.
భారీకేడ్ల నుంచి దూకారు
కుటుంబ సభ్యులు, అభిమానులు, టిడిపి కార్యకర్తలు భూమా పార్థివదేహాన్ని చూసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసిన భారీకేడ్లను సైతం లెక్కచేయకుండా దూకారు. భూమా తనయుడు జగత్ విఖ్యాత రెడ్డిని చూసిన అభిమానులు 'భూమన్న.. భూమన్న' అంటూ నినాదాలు చేశారు.

విలపించిన అఖిలప్రియ
అంత్యక్రియల సమయంలో అఖిల ప్రియ తన సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డిని పట్టుకొని బోరున విలపించారు. అఖిల ప్రియ తన తండ్రి భూమా తలను నిమురుతూ విలవిలలాడిపోయారు. ఈ ఘటన చూసిన వారు అఖిలప్రియతో పాటు విలపించారు.
కుటుంబ సభ్యుడిని కోల్పోయిన పార్టీ: చంద్రబాబు
పార్టీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. తనతో చాలా సన్నిహితంగా ఉండేవాడని చెప్పారు. నంద్యాల అభివృద్ధికి నిత్యం కృషి చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications