మంగళగిరిలోనే చంపేస్తాం: వైసిపి ఎమ్మెల్యే ఆళ్లకు బెదిరింపు, ఓటుకు నోటు ఎఫెక్ట్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సోమవారం నాడు బెదిరింపు లేఖ వచ్చింది. చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆయనకు లేఖ వచ్చింది. దీంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేను నిప్పు: చంద్రబాబు కౌంటర్, అదే పాయింట్ లాగుతున్న జగన్
ఓటుకు నోటు కేసు పైన సుప్రీం కోర్టుకు వెళ్తే చంపేస్తామని ఆ లేఖలో హెచ్చరించారని తెలుస్తోంది. మంగళగిరిలోనే నిన్ను చంపేస్తామని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పైనే కేసు వేస్తావా, నీ అంతు తేలుస్తామని వాట్సాప్‍లో ఆ లేఖ వచ్చినట్లుగా తెలుస్తోంది.
దీనిపై ఆళ్ల మాట్లాడుతూ.. కేసులకు భయపడే ఇలాంటి సందేశాలు పంపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పైన ఆళ్ల మండిపడ్డారు. చంద్రబాబు కోర్టు విచారణను ఎదుర్కొని తన సచ్చీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, ఓటుకు నోటు కేసులో ఆళ్ల రామకృష్ణా రెడ్డి కొద్ది రోజుల క్రితం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను విచారించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబు ప్రమేయం పైన దర్యాఫ్తు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. తన పైన విచారణ జరపాలన్న ఏసీపీ న్యాయస్థానం తీర్పు పైన స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది.












Click it and Unblock the Notifications