వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలపై ఇప్పటికే అనేక అనుమానాలున్నాయ్ ... వీడెవడో ఈవీఎంల‌ను పేల్చేస్తానంటున్నాడు !

|
Google Oneindia TeluguNews

విశాఖ‌లో ఓ బెదిరింపు మెసేజ్ క‌ల‌క‌లం సృష్టించింది. ఈవీఎంలే టార్గెట్‌గా పేలుళ్ల‌కు పాల్ప‌డ‌తామంటూ వ‌చ్చిన మెసేజ్‌ ఓ బ్యాంకు మేనేజర్‌కు రావ‌టంతో అది పోలీసుల‌కు చేరవేసారు. దీంతో..రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకు మేనేజ‌ర్ ఫిర్యాదు మేర‌కు మెసేజ్ చేసిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈవీఎంల‌ను పేల్చేస్తాం..
విశాఖ‌లో ఇవియంల‌ను పేల్చేస్తాం అంటూ వ‌చ్చిన ఓ మెసేజ్ క‌ల‌క‌లం సృష్టించింది. అన‌కాప‌ల్లి విశాఖ గ్రామీణ బ్యాంకును పేల్చేస్తామంటూ ఆ బ్యాంకు మేనేజర్‌కు మెసేజ్ వ‌చ్చింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌తో పాటుగా ఈవీఎంలే ల‌క్ష్యంగా పేలుళ్ల‌కు పాల్ప‌డ‌తామంటూ మెసేజ్‌లో సందేశం ఉంది. దీంతో, బ్యాంకు మేనేజ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. రంగంలోకి దిగిన పోలీసులు మెసేజ్ ఎవ‌రు పంపార‌నే దాని పైన విచార‌ణ ప్రారంభించారు.

Threatened message on EVMs..Visakha police arrested that person

బెదిరింపుల‌కు పాల్ప‌డింది అన‌కాప‌ల్లి మండ‌లం వెలుగు కమ్యూనిటీలో క్ల‌స్ట‌ర్ ఏజెంట్‌గా ప‌ని చేస్తున్న రాచేప‌ల్లి వీర శివ రంజ‌నిగా పోలీసులు గుర్తించారు. బ్యాంకు మేనేజ‌ర్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు శివ‌రంజ‌నిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు మేనేజ‌ర్‌తో స‌హా మ‌రో 16మందికి ఇదే విధంగా బెదిరింపు మెసేజ్‌లు పెట్టిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు.

రూమ‌ర్లు సృష్టిస్తే క‌ఠిన చ‌ర్య‌లు..
ఇప్ప‌టికే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణంతో ఏపిలో ప‌రిస్థితి హాట్ హాట్‌గా ఉంది. పోలింగ్ రోజున ఇవియంల మొరాయింపు.. అర్ద‌రాత్రి వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌టం పైన ఏపి అధికార పార్టీ నేత‌లు ఎన్నిక‌ల సంఘం పైన తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇక‌, పోలింగ్ ముగిసిన తరువాత కూడా ఇదే ర‌క‌మైన ప‌రిస్థితి కొన‌సాగుతోంది. అయితే, రాజ‌కీయ పార్టీలు సైతం రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వ‌ద్ద ప‌ర‌స్ప‌రం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.

తాజాగా ఇవియంలు నిక్షిప్తం చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల భ‌ద్ర‌త మీద ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీంతో..రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి తాజాగా హెచ్చరిక జారీ చేసారు. ఎవ‌రైనా ఇవియంలు..స్ట్రాంగ రూమ్‌ల గురించి అస‌త్య ప్ర‌చారం చేసినా..రూమ‌ర్లు సృష్టించినా క్రిమ‌న‌ల్ కేసులు న‌మోదు చేయ‌టంతో పాటుగా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని సీఈవో హెచ్చ‌రించారు. దీంతొ..విశాఖ‌లో వ‌చ్చిన మెసేజ్‌ల క‌ల‌క‌లం పైన పోలీసులు సీరియ‌స్‌గా స్పందించారు.

English summary
Police Arrested the agent who threatened Bank Manager over sms that blast EVM's and Bank. Police started enquiry on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X