జల్సాలకు మరిగి గొలుసు చోరీలు, స్త్రీ అరెస్టు (పిక్చర్స్)

హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పశ్చిమ మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వెస్ట్ జోన్ డిసిపి వి. సత్యనారాయణ బుధవారం మీడియాకు వెల్లడించారు. నేరెడ్‌మెట్‌లోని దినకరనగర్‌కు చెందిన ఇమ్మంది మహేష్, సికింద్రాబాద్‌లోని ఆర్కెపురానికి చెందిన రాహుల్ సన్ని స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు చైన్ స్నాచింగ్‌లు చేయడం మొదలుపెట్టారు.

హీరోహోండా ఫ్యాషన్ మోటార్ సైకిల్‌పై తిరుగుతూ ఎస్ఆర్‌నగర్‌లో మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను లాక్కుపోయేవారు. ఇలా దొంగిలించిన గొలుసులను సఫిల్‌గూడలో ఉంటున్న బంగారం వ్యాపారి శివుని శ్రీనివాసాచారికి విక్రయించేవారు. కాగా, బీకేగూడలోని యాదవ్ పార్కు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహేష్ పోలీసులకు దొరికపోయాడు.

అతడ్ని విచారించగా అసలు గుట్టు బయటికొచ్చింది. రాహుల్ సన్నితో కలిసి ఎస్ఆర్‌నగర్‌లో మొత్తం ఐదు స్నాచింగ్‌లు చేసినట్లు అతడు అంగీకరించాడు. కాగా, శ్రీనివాసాచారి పరారీలో ఉన్నాడు. మహేష్ నుంచి మూడు తులాల బంగారం, హీరోహోండా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో దుకాణాల్లో ఉండే మహిళల మెడల్లో గొలుసులు లాక్కునిపోయే సయ్యద్ షాబుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు హేమంత్ కుమార్‌ను అరెస్ట్ చేసి పల్సర్ బైక్‌ను సీజ్ చేశారు.

గోల్కొండలోని అజీజ్‌బాగ్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన తూర్పుగోదావరి జిల్లా గండపెల్లి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన కొయ్యా సత్యవతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ. 5లక్షల విలువైన 16 తులాల బంగారం, 25తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్

అరెస్ట్

చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పశ్చిమ మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వెస్ట్ జోన్ డిసిపి వి. సత్యనారాయణ బుధవారం మీడియాకు వెల్లడించారు.

అరెస్ట్

అరెస్ట్

నేరెడ్‌మెట్‌లోని దినకరనగర్‌కు చెందిన ఇమ్మంది మహేష్, సికింద్రాబాద్‌లోని ఆర్కెపురానికి చెందిన రాహుల్ సన్ని స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు చైన్ స్నాచింగ్‌లు చేయడం మొదలుపెట్టారు.

అరెస్ట్

అరెస్ట్

హీరోహోండా ఫ్యాషన్ మోటార్ సైకిల్‌పై తిరుగుతూ ఎస్ఆర్‌నగర్‌లో మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను లాక్కుపోయేవారు.

అరెస్ట్

అరెస్ట్

ఇలా దొంగిలించిన గొలుసులను సఫిల్‌గూడలో ఉంటున్న బంగారం వ్యాపారి శివుని శ్రీనివాసాచారికి విక్రయించేవారు. బీకేగూడలోని యాదవ్ పార్కు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహేష్ పోలీసులకు దొరికపోయాడు.

అరెస్ట్

అరెస్ట్

మరో ఘటనలో దుకాణాల్లో ఉండే మహిళల మెడల్లో గొలుసులు లాక్కునిపోయే సయ్యద్ షాబుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్

అరెస్ట్

గోల్కొండలోని అజీజ్‌బాగ్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన తూర్పుగోదావరి జిల్లా గండపెల్లి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన కొయ్యా సత్యవతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ. 5లక్షల విలువైన 16 తులాల బంగారం, 25తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+